TTD TO DEVELOP ANJANADRI ANJANEYA TEMPLE AT AKASHA GANGA – TTD CHAIRMAN _ ఆకాశ‌గంగ వ‌ద్ద ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌య అభివృద్ధి : టిటిడి ఛైర్మ‌న్

Tirumala, 19 June 2021:TTD Chairman Sri YV Subba Reddy said on Saturday that TTD will take up all round development of the Anjaneya temple at Anjanadri near Akashaganga at Tirumala soon.

Speaking  to media after performing special pujas at the temple along with TTD EO Sri KS Jawahar Reddy, other board members and Additional EO Sri AV Dharma Reddy, the TTD Chairman said  Akasaganga is believed by devotees as birth place of Sri Anjaneya and hence TTD plans to develop the Anjana Devi sameta Bala Anjaneya temple in this area.

Later TTD EO said the Vedic pundits committee had also assessed that Anjanadri at Akashaganga as birth place of Anjaneya and hence an action plan was prepared for developing all devotee friendly facilities here on war footing.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఆకాశ‌గంగ వ‌ద్ద ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌య అభివృద్ధి : టిటిడి ఛైర్మ‌న్

తిరుమల, 2021 జూన్ 19: ఆంజ‌నాద్రి ప‌ర్వ‌త‌మే ఆంజ‌నేయ స్వామివారి జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని, ఆకాశ‌గంగ వ‌ద్ద ఆల‌యాన్ని అభివృద్ధి చేస్తామ‌ని టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి అన్నారు. టిటిడి ఛైర్మ‌న్‌, ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యుల‌తో క‌లిసి శ‌నివారం బాల ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యాన్ని ద‌ర్శించుకుని ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా  ఛైర్మ‌న్ మీడియాతో మాట్లాడుతూ టిటిడి ఆంజ‌నేయ‌స్వామివారి జ‌న్మ‌స్థ‌లం ఆకాశ‌గంగ అని న‌మ్ముతుంద‌న్నారు. ఇదే విష‌యాన్ని శ్రీ‌వారి భ‌క్తులు కూడా విశ్వ‌సిస్తూన్నార‌ని, దీనిపై ఎవ‌రితోను ఎలాంటి చ‌ర్చ‌లు లేవ‌న్నారు. ఆకాశ‌గంగ వ‌ద్ద అంజ‌నాదేవి స‌మేత బాల ఆంజ‌నేయ‌స్వామివారి ఆల‌యాన్ని అభివృద్ధి చేయ‌నున్న‌ట్లు వివ‌రించారు.

అనంత‌రం ఈవో మాట్లాడుతూ టిటిడి ఏర్పాటు చేసిన పండిత ప‌రిష‌త్ నివేదిక‌లో ఆంజ‌నాద్రిలోని ఆకాశ‌గంగ ఆంజ‌నేయ‌స్వామివారి జ‌న్మ‌స్థ‌ల‌మ‌ని పురాణాల ద్వారా నిర్ణ‌యించార‌ని తెలిపారు. ఆకాశ‌గంగ వ‌ద్ద భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన సౌక‌ర్యాలు, ఆల‌య అభివృద్ధిపై కార్య‌చ‌ర‌ణ ప్ర‌ణాళిక‌లు రూపొందించి అభివృద్ధి చేస్తామ‌న్నారు.    

ఈ కార్య‌క్ర‌మంలో అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, బోర్డు స‌భ్యులు శ్రీ శేఖ‌ర్‌రెడ్డి, శ్రీ గోవింద‌హ‌రి, శ్రీ పార్థ‌పార‌ధిరెడ్డి, డాక్ట‌ర్ నిశ్చిత‌, శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, శ్రీ రాజేష్‌శ‌ర్మ‌, శ్రీ ర‌మేష్‌శెట్టి, శ్రీ శివ‌శంక‌ర్‌, శ్రీ డి.పి.అనంత‌, శ్రీ మ‌ల్లాది విష్ణు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.    

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.