TTD TO ISSUE LOCAL DARSHAN QUOTA TOKENS ON JANUARY 5 _ జనవరి 5న స్థానికులకు శ్రీవారి దర్శనం టోకెన్లు జారీ
Tirumala, 23 December 2024: As per the decision taken in the last TTD board meeting, the locals will be given darshan of Srivaru on the first Tuesday of every month.
As such in 2025, for darshan on January 07 (Tuesday) Srivari Darshan tokens will be issued at the counters in Tirupati Mahathi Auditorium and Tirumala Balaji Nagar Community Hall on January 5 (Sunday).
The residents of Tirupati Urban, Rural, Chandragiri, Renigunta mandals as well as Tirumala must show their original Aadhaar card to get these tokens.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
జనవరి 5న స్థానికులకు శ్రీవారి దర్శనం టోకెన్లు జారీ
తిరుమల, 2024 డిసెంబర్ 23: శ్రీవారి దర్శనార్థం తిరుపతి స్థానికులకు 2025, జనవరి 5న స్థానిక దర్శన కోటా టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. గత టిటిడి బోర్డులో తీసుకున్న నిర్ణయం మేరకు ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు.
2025, జనవరి 7వ తేదీ మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు జనవరి 5న (ఆదివారం) తిరుపతి మహతి ఆడిటోరియంలోని కౌంటర్లలోను, తిరుమల బాలాజీ నగర్ లో శ్రీవారి దర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.
తిరుపతి అర్బన్, రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలలోని స్థానికులు తప్పనిసరిగా తమ ఒరిజినల్ ఆధార్ కార్డు చూపించి టోకెన్లు పొందవలసి ఉంటుంది.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.