TTD TO OPEN UP KALYANA VEDIKA ONLINE BOOKINGS SOON _ తిరుమలలో త్వరలో సామూహిక వివాహాలకు అనుమతి

Tirumala, 5 Feb. 21: TTD is all set to resume online bookings of Kalyana Vedika in Tirumala soon.

The mass marriages, ear boring ceremonies etc.usually takes place in the mammoth Kalyana Vedika platform located in Papavinasanam road.

Due to Covid 19 last year, TTD has temporarily stalled the mass marriages and other rituals in Kalyana Vedika.

As the Covid pandemic is slowly receding, TTD has decided to resume the functioning of Kalyana Vedika upon the requests from pilgrims.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో త్వరలో సామూహిక వివాహాలకు అనుమతి

– ఆన్లైన్ లో బుకింగ్ కు టీటీడీ నిర్ణయం

తిరుమల 5 జనవరి 2021: తిరుమల పాపనాశనం రోడ్డులోని కళ్యాణ వేదికలో త్వరలోనే సామూహిక వివాహాలకు అనుమతి ఇవ్వాలని టీటీడీ నిర్ణయించింది. భక్తుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు
ఆన్లైన్ ద్వారా సామూహిక వివాహాలతో పాటు చెవిపోగులు కుట్టించుకోవడానికి కూడా అనుమతించాలని నిర్ణయం తీసుకుంది.

కోవిడ్ 19 నేపథ్యంలో తిరుమల కళ్యాణ వేదికలో సామూహిక వివాహాలకు టీటీడీ అనుమతులు నిలివేసింది. ప్రస్తుతం కోవిడ్ తగ్గుముఖం పట్టడం, భక్తుల నుంచి విజ్ఞప్తులు వస్తుండటంతో కళ్యాణ వేదిక కార్యక్రమాలు పునరుద్ధరించాలని టీటీడీ నిర్ణయించింది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది