TTD TO PERFORM SPECIAL RITUALS DURING MAGHA MASAM-EO _ డ‌య‌ల్ యువ‌ర్ ఈవో ముఖ్యాంశాలు

Tirumala, 5 Feb. 21: After successfully performing the Karthika Masa and Dhanurmasa Deeksha programmes in a big way which won laurels from devotees of Srivaru present across the world, TTD is all set to observe a series of special pujas in the ensuing Magha Masam, said TTD EO Dr KS Jawahar Reddy.

Before receiving the calls from pilgrim callers across the country as part of Dial your EO programme held at the Conference Hall of TTD Administrative Building in Tirupati on Friday, the EO briefed about the upcoming activities mulled by TTD. He said, as the Magha Masa is commencing from next Friday onwards, there will be Magha Purana Pravachanam at Nada Neeranjanam platform everyday between 6 am and 6.40 am from February 12 till March 13.

Enlisting the series of religious programmes lined up during Magha Masam, the EO said, on February 14-Magha Bhanu Puja at Dharmagiri Veda Pathashala in Tirumala on February 15 Kunda Chaturthi Abhisekam for Lord Siva at Tirupati Dhyanaramam where in Abhishekam will be performed to the deity with jasmines, On February 16- Vasantha Panchami Mahotsavam at Nellore, February 19-Rathasapthami in Tirumala, February 23-Bhishma Ekadasi, Sundarakanda and Vishnu Sahasra Nama parayanams, February 27-Magha Purnima Punya Snanam at Triveni Sangamam in Kaleswaram of Telangana State, March 11-Maha Nyasapurvaka Rudrabhisekam at Dhyanaramam in Tirupati on the occasion of Maha Shivaratri. EO said all these programmes will be telecasted live on SVBC for the benefit of devotees who are present across the world.

Among the other important development activities included a revival of Annamacharya Sankeetans and Sri Purandharadasa Padas, promotion of Panchagavya products, the commencement of online virtual kalyanams in Sri Padmavathi Ammavari Temple at Tiruchanoor soon, printing and publication of epic puranams as a part of the dharmic mission, construction of 500 more Sri Venkateswara Swamy temples in SC, ST, BC, fishermen colonies during the second phase in both Telugu states etc.

Additional EO Sri AV Dharma Reddy, CVSO Sri Gopinath Jatti, CE Sri Ramesh Reddy, CEO SVBC Sri Suresh Kumar and other senior officers were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

డ‌య‌ల్ యువ‌ర్ ఈవో ముఖ్యాంశాలు

తిరుమల, 2021 ఫిబ్ర‌‌వ‌రి 05: తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భవనంలో శుక్రవారం జరిగిన డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి‌ భక్తులను ఉద్దేశించి ప్రసంగించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

వైకుంఠ ఏకాదశి

– వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో మొట్టమొదటిసారిగా 10 రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరిచి 4.26 లక్షల మంది భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం భాగ్యం కల్పించాం.

–  మొదటిసారిగా వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజుల్లో దాతలకు దర్శనం కల్పించాం.

ధనుర్మాస కార్యక్రమాలు

– ధనుర్మాస కార్యక్రమాల్లో భాగంగా విష్ణు అవతార వైభవ ప్రవచనాలు, గోపూజతో పాటు తిరుప్పావై పాశుర పఠనం నిర్వహించాం.

– జనవరి 8న కర్నూలులో ధనుర్మాస లక్ష్మీ దీపారాధన, జనవరి 14న తిరుపతిలో గోదా కల్యాణం, జనవరి 15న నరసారావుపేటలో ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గారి చేతులమీదుగా కామధేను పూజ నిర్వహించాం.

పంచగవ్య ఉత్పత్తులు

– పంచగవ్యాలైన పాలు, పెరుగు, నెయ్యి, పేడ, గోమూత్రంతో పలు ఉత్పత్తులను తయారుచేసి ఆరోగ్య, వ్యవసాయ రంగాల్లో వినియోగించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. ఇందుకు సంబంధించి దేశంలోని పేరుగాంచిన సంస్థల సహకారం తీసుకుంటున్నాం.

–     ఇదిలా ఉండగా ఫిబ్రవరి నెలలో అనేక కార్యకమ్రాలను నిర్వహించనున్నాం.

శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

–     కర్ణాటక సంగీత పితామహులు శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు ఫిబ్రవరి 10 నుండి 12వ తేదీ వరకు తిరుమల, తిరుపతిలో ఘనంగా నిర్వహిస్తాం. దీంతోపాటు కర్ణాటకలోని హంపి, ఉడిపి ప్రాంతాల్లో కూడా ఈ ఉత్సవాలను నిర్వహిస్తాం.

రథసప్తమి

–     ఫిబ్రవరి 19న సూర్యజయంతి సందర్భంగా తిరుమలలో రథసప్తమి వేడుకగా నిర్వహిస్తాం.

– ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు ఉదయం 5.30 నుండి రాత్రి 9 గంటల వరకు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. మధ్యాహ్నం 2 నుండి 3 గంటల వరకు చక్రస్నానం జరుగుతుంది.

– స్వామివారు ఒకేరోజు ఏడు ప్రధాన వాహనాలపై మాడ వీధుల్లో ఊరేగడం వల్ల దీన్ని ఒకరోజు బ్రహ్మోత్సవాలని, ఉప బ్రహ్మోత్సవాలని పిలుస్తారు.

– రథసప్తమి రోజు స్వామివారి దర్శన టోకెన్లు గల భక్తులను మాత్రమే తిరుమలకు అనుమతించడం జరుగుతుంది.

మాఘ మహోత్సవం

– పవిత్రమైన మాఘ మాసంలో మాఘ మహోత్సవం పేరిట పలు పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తాం. ఇందులో భాగంగా …

– ఫిబ్రవరి 12 నుండి మార్చి 13వ తేదీ వరకు తిరుమల నాదనీరాజనం వేదికపై ఉదయం 6 నుండి 6.40 గంటల వరకు మాఘపురాణం ప్రవచనం,

ఫిబ్రవరి 14న తిరుమల ధర్మగిరి వేద పాఠశాలలో మాఘ భానుపూజ,

ఫిబ్రవరి 15న తిరుపతి ధ్యానారామంలో కుంద చతుర్థి (పరమశివుడికి మల్లెపూల‌తో అభిషేకం),

ఫిబ్రవరి 16న నెల్లూరులో వసంతపంచమి మహోత్సవం,

ఫిబ్రవరి 19న తిరుమలలో రథసప్తమి,

ఫిబ్రవరి 23న తిరుమలలో భీష్మ ఏకాదశి, సుందరకాండ పఠనం, విష్ణుసహస్రనామ పారాయణం,

ఫిబ్రవరి 27న తెలంగాణ రాష్ట్రం కాలేశ్వరంలోని త్రివేణి సంగమంలో మాఘపూర్ణిమ పుణ్యస్నానం,

మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా తిరుపతి ధ్యానారామంలో మహన్యాసపూర్వక రుద్రాభిషేకం.

– ఈ కార్యక్రమాలన్నింటినీ ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.

అన్నమయ్య సంకీర్తనల పరిష్కరణ

– శ్రీ తాళ్లపాక అన్నమయ్య రచించిన సంకీర్తనల్లో ఇంకా మిగిలిపోయిన వాటిని త్వరితగతిన పరిష్కరించి, రికార్డు చేసి భక్తజన బాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అన్నమాచార్య సంకీర్తనలకు అర్థతాత్పర్యాలపై లోతైన విశ్లేషణ చేసి భక్తులకు అందుబాటులో ఉంచాలని కృషి చేస్తున్నాం.

తిరుచానూరులో త్వరలో ఆన్‌లైన్‌ వర్చువల్‌ కల్యాణోత్సవం

– భక్తుల కోరిక మేరకు తిరుమల శ్రీవారి ఆలయం తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆన్‌లైన్‌ వర్చువల్‌ కల్యాణోత్సవం ప్రారంభిస్తాం. ఇందుకోసం భక్తులు ఫిబ్రవరి 9వ తేదీ నుండి ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.

పురాణాల ముద్రణ

– ధర్మప్రచారంలో భాగంగా అష్టాదశ పురాణాలను తెలుగులోకి అనువదించి భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాం.

– ఇప్పటివరకు కూర్మమహాపురాణం, విష్ణుమహాపురాణం, బ్రహ్మమహా పురాణం, మత్స్యమహాపురాణంలో ఒక భాగాన్ని గ్రంథ రూపంలో భక్తులకు అందుబాటులోకి తెచ్చాం. ప్రముఖ పండితుల ఆధ్వర్యంలో ఇతర పురాణాల అనువాద పనులు జరుగుతున్నాయి.

తిరుమలలో మంత్ర పారాయణానికి విశేష స్పందన

– ప్రపంచంలోని ప్రజలను కోవిడ్‌ బారి నుండి కాపాడి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మార్చి 16 నుండి నిర్వహిస్తున్న యోగవాశిస్టం – శ్రీ ధన్వంతరి మహామంత్ర పారాయణం, సుందరకాండ పారాయణాలు ప్రారంభించి 300 రోజులు పూర్తయ్యాయి.

– ఎస్వీబీసీలో ప్రత్యక్ష ప్రసారమవుతున్న ఈ  కార్యక్రమాలను చుస్తూ తమ ఇళ్లలో పారాయణం చేస్తున్న దేశ విదేశాల్లోని కోట్లాది మంది భక్తులకు శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆశీస్సులు లభించాలని కోరుకుంటున్నాను.

ఉగాదికి ఎస్వీబీసీ కన్నడ, హిందీ చానళ్ళు

– ఉగాది పర్వదినం సందర్భంగా ఏప్రిల్‌ 13వ తేదీ ఎస్వీ భక్తి చానల్ కన్నడ, హింది చానళ్ళను ప్రారంభించాలని నిర్ణయించాం.

పుస్తక రూపంలోనికి పురందర దాసుల కీర్తనలు

– కర్ణాటక రాష్ట్రానికి చెందిన హరిదాసుల సంకీర్తనలను దాస సాహిత్య ప్రాజెక్టు ద్వారా ” సర్వస్వం” పేరుతో పుస్తక రూపంలోకి తేవాలని నిర్ణయించాం. ఇప్పటికే టిటిడి వద్ద ఉన్న కీర్తనలతో పాటు మరిన్ని కీర్తనలను సేకరించి, పరిష్కరించడానికి పండిత పరిషత్‌ను ఏర్పాటు చేశాం. ఈ కార్యకమ్రానికి భక్తుల సహకారం కోరుతున్నాం.

తెలుగు రాష్ట్రాల్లో మరో 500 ఆలయాల నిర్మాణం

– హిందూ ధర్మ ప్రచార పరిషత్‌ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల్లో రెండవ విడతగా మరో 500 ఆలయాలను నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నాం. ఆంధ్ర ప్రదేశ్‌లో సమరసత సేవా ఫౌండేషన్‌, తెలంగాణలో సంస్కృతి వర్థిని సంస్థల ద్వారా ఈ ఆలయాలను నిర్మిస్తాం.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.