TTD TO PERFORM PARAYANAM AND YAGAM FOR WELL BEING OF HUMANITY _ లోక క‌ల్యాణార్థం టిటిడి వివిధ యాగాల నిర్వ‌హ‌ణ‌

Tirumala, 15 Mar. 20: TTD is set to perform Veda Parayanam and Yagam for the sake of Universal wellbeing.

A ten-day Japa Yajnam named as Sri Srinivasa Veda Mantra Arogya Japa Yajnam programme will begin at the Asthana Mandapam on March 16 and concludes on March 25. Nearly 30 prominent Vedic exponents from all southern states are participating in this Jape Yana.

The TTD is conducting this Chaturveda Parayanam under the aegis of SV Higher Vedic Studies for six hours a day during these ten days from 8am to 11am and again from 4pm to 7pm.

TTD is organising Sri Srinivasa Shantyotsava Sahita Dhanvantari Maha Yagam at Dharmagiri Veda Pathasala from March 26 to 28(earlier it was announced as March 19-21 at Paruveta Mandapam. But the venue and dates changed due to administrative reasons).

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI  

 

లోక క‌ల్యాణార్థం టిటిడి వివిధ యాగాల నిర్వ‌హ‌ణ‌

తిరుమల, 2020 మార్చి 15: ప్ర‌జంద‌రూ సుఖ సంతోషాల‌తో ఆరోగ్య‌వంతులుగా ఉండాల‌ని ఆకాంక్షిస్తూ లోక‌క‌ల్యాణం కోసం శ్రీ శ్రీ‌నివాస వేద‌మంత్ర ఆరోగ్య జ‌ప‌య‌జ్ఞాన్ని టిటిడి చేప‌ట్ట‌నుంది.

ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ఆధ్వర్యంలో తిరుమ‌ల‌లోని ఆస్థాన‌మండ‌పంలో మార్చి 16న సోమ‌వారం సాయంత్రం 4 గంట‌ల‌కు ఈ జ‌ప‌య‌జ్ఞం ప్రారంభ‌మ‌వుతుంది. ద‌క్షిణాది రాష్ట్రాల నుండి దాదాపు 30 మంది వేదపండితులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొంటారు. మార్చి 25వ తేదీ వ‌ర‌కు ఉద‌యం 8 నుండి 11 గంట‌ల వ‌ర‌కు, సాయంత్రం 4 నుండి 7 గంట‌ల వ‌ర‌కు క‌లిపి రోజుకు 6 గంట‌ల పాటు చ‌తుర్వేద పారాయ‌ణం జ‌రుగుతుంది.

అదేవిధంగా, విశ్వ‌మాన‌వ శ్రేయ‌స్సును ఆకాంక్షిస్తూ, శ్రీ‌వారి ఆశీస్సులు కోరుతూ మార్చి 26, 27, 28వ తేదీల్లో తిరుమ‌ల‌లోని ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల‌లో శ్రీ శ్రీనివాస శాంత్యోత్సవ సహిత ధన్వంతరి మహాయాగం జ‌రుగ‌నుంది. కాగా, ముందుగా ధ‌న్వంత‌రి మహాయాగాన్ని మార్చి 19 నుండి 21వ తేదీ వ‌ర‌కు తిరుమ‌ల‌లోని పార్వేట మండ‌పంలో నిర్వ‌హించాల‌ని టిటిడి నిర్ణ‌యించింది. అయితే, ప‌రిపాల‌నా కార‌ణాల వ‌ల్ల తేదీల‌ను, స్థ‌లాన్ని మార్చ‌డం జ‌రిగింది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.