TTD TO RECORD 10,000 ANNAMIAH SANKEERTANS ON WAR FOOTING, SAYS ADDITIONAL EO _ అన్నమయ్య సంకీర్తనలన్నింటికి అర్థ, తాత్పర్యాలు – వీటిని తెలుసుకుని పాడితేనే అద్భుత ఆవిష్కరణ జరుగుతుంది – గాయకులు, స్వరకర్తలతో టీటీడీ అదనపు ఈఓ శ్రీ ధర్మారెడ్డి

Tirumala, 20 Dec. 20: TTD is all set to compose all Sankeertans of Saint poet Tallapaka Annamacharya in four to five years time, says additional EO Sri AV Dharma Reddy on Sunday.

Addressing a meeting of music composers, and exponents of classical music at Annamaiah Bhavan, the Additional EO said as directed by the TTD EO, the objective of the spiritual crusade was to put all sankeertanas in format with commentary, music and voice by reputed singers.

He said of the 32,000 sankeetans composed by the saint poet, 14,000 were retrieved by the TTD Annamacharya project and of these so far 4000 sankeertanas have been put on format with music and voice.

At the three hour long session with singers and composers from several states, the Additional EO said the TTD aimed to format all sankeertanas with a narrative about the period and circumstances of composing, for the remaining 10,000 sankeertanas along with commentary on content.

The Additional EO said in a pilot project each composer will be allocated 8-10 sankeetans to compose music and give voice.

He also appealed to music composers to become partners in the holy project of recording and publishing the Annamacharya keertanas. He also invited the music composers and singers to participate in the sundarakanda, Bhagavad Gita and Virata Parva Parayanams at Nada Niranjanam.

He said the TTD was contemplating on sending teams of artists to America and Australia to propagate Annamaiah sankeerthana after the end of Covid-19 environment.

He said the TTD would not only upload them on TTD website and permit free downloads but also upload in the SVBC YouTube as part of propagation of sanatana Hindu Dharma.

Speaking at the meeting SVBC chairman Sri Sai Krishna Yachendra urged composers to make it more spiritual and to observe some guidelines.

Senior singer Sri Balakrishna Prasad, SV Recording Project executive committee members Smt Kanyakumari, Sri Sudhakar, Sri Veerabhadra Rao, OSD of project and coordinator Sri Vibhishana Sharma, Annamacharya project director Sri Dakshinamurthy, SVBC director Sri Swapna and several singers, music Directors were present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDS, TIRUPATI

అన్నమయ్య సంకీర్తనలన్నింటికి అర్థ, తాత్పర్యాలు
– వీటిని తెలుసుకుని పాడితేనే అద్భుత ఆవిష్కరణ జరుగుతుంది
– గాయకులు, స్వరకర్తలతో టీటీడీ అదనపు ఈఓ శ్రీ ధర్మారెడ్డి

తిరుమల 20 డిసెంబరు 2020: పద కవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు రాసిన 14 వేల సంకీర్తనలకు అర్థం, తాత్పర్యం, ఏ కీర్తన ఎప్పుడు, ఏ సందర్భంలో రాసి ఉంటారనే వివరణలతో కీర్తనలను జనబాహుళ్యంలోకి తీసుకుని పోవాలని టీటీడీ నిర్ణయించిందని అదనపు ఈవో శ్రీ ధర్మారెడ్డి చెప్పారు. నాలుగైదేళ్లలో ఈ ఆధ్యాత్మిక యజ్ఞం పూర్తి చేయాలని అనుకుంటున్నట్లు తెలిపారు.

తిరుమల అన్నమయ్య భవన్ లోని సమావేశ మందిరంలో ఆదివారం ఆయన వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన గాయకులు, స్వరకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ, అన్నమాచార్యులు రాసిన 32 వేల సంకీర్తనల్లో 14 వేలు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు వద్ద ఉన్నాయన్నారు. ఇందులో ఇప్పటి వరకు 4 వేల కీర్తనలు స్వరపరచి జనబాహుళ్యంలోకి పంపామన్నారు. ఆ నాలుగు వేలతో పాటు మిగిలిన 10 వేల కీర్తనలను కూడా ప్రతి పదానికి అర్థం,తాత్పర్యంతో ప్రజల్లోకి తీసుకుపోవాలని టీటీడీ యాజమాన్యం నిర్ణయించిందని చెప్పారు. గాయకులు కీర్తనలోని ప్రతి పదానికి అర్థం, ఆ కీర్తన రాసిన సందర్భం తెలుసుకుని పాడితేనే అద్భుతమైన ఆవిష్కరణ జరుగుతుందన్నారు. స్వర పరచకుండా మిగిలిన కీర్తనల్లో ఎన్నిటిని స్వరపరచ వచ్చనే విషయంపై పరిశోధన చేసి ఒక నిర్ణయానికి రావాల్సి ఉందన్నారు. కళాకారులు స్వామి మీద భక్తితో, హృదయపూర్వకంగా ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా స్వరపరుస్తున్న ఈ కీర్తనలను టీటీడీ వెబ్సైట్, ఎస్వీబీసీ యూట్యూబ్ నుంచి ఉచితంగా డౌన్లోడ్ చేసుకునే ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమల నాద నీరాజనం వేదిక మీద టీటీడీ నిర్వహిస్తున్న సుందరకాండ, భగవద్గీత, విరాటపర్వం కార్యక్రమాలలో పాలుపంచుకోవాలని కళాకారులను ఆహ్వానించారు. కరోనా తొలగి పోయాక అమెరికా, ఆస్ట్రేలియా దేశాలకు కళాకారులను పంపి అన్నమయ్య సంకీర్తనల ప్రచారం చేయిస్తామన్నారు. పైలెట్ ప్రాజెక్టు గా ఒక స్వరకర్తకు 8 నుంచి 10 కీర్తన లు ఇచ్చి వాటిని స్వరపరచే బాధ్యత ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఎస్వీబీసీ చైర్మన్ శ్రీ సాయి కృష్ణ యాచేంద్ర మాట్లాడుతూ, కళాకారులు ఎవరినో మెప్పించడానికి కీర్తనలను స్వరపరచరాదని కోరారు. అన్నమయ్య కీర్తనలు సినిమా పాటల్లాగా ఉండరాదని చెప్పారు.

సీనియర్ గాయకులు శ్రీ బాలకృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, కీర్తనలు స్వరపరచడంలో సరళత్వం పోకూడదని, అందరూ విని అందరూ పాడుకునేలా ఉండాలని సూచించారు.

ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు కార్యనిర్వాహక కమిటీ సభ్యులు శ్రీమతి కన్యాకుమారి, శ్రీ సుధాకర్, శ్రీ వీరభద్ర రావు, ప్రాజెక్టు ప్రత్యేకాధికారి, కార్యక్రమ సమన్వయ కర్త శ్రీ విభీషణ శర్మ, ఉన్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీ దక్షిణా మూర్తి, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీ స్వప్న తో పాటు పలువురు గాయకులు, సంగీత దర్శకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది