TTD WOMEN EMPLOYEES TO OBSERVE INTERNATIONAL WOMEN’S DAY ON MARCH 8 _ మార్చి 8న మహతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

DOYEN OF SPW COLLEGE DR RAJESWARI MURTY TO BE AWARDED WITH SRI PADMAVATHI VIDYA PRAKASINI

 

SRI SHAKTI PEERHADEESHWARI MATA RAMYANANDA BHARATI TO GRACE THE FETE

 

TIRUPATI, 05 March 2023: In connection with International Women’s Day on March 8, TTD women employees are set ready to observe the fete in a big way under the aegis of the Welfare department of TTD.

 

TTD has invited Mata Ramyamamda Bharati, Sri Shakti Peerhadeeshwari to grace the occasion and render her Anugraha Bhashanam.

 

The other important speakers includes Smt Goutami, IAS, CEO Renigunta Electronic Manufacture Cluster, Smt Sarita, IPS, SP CID.

 

Among the achievers in various fields International Hockey Player, Ms Rajani from Chittoor district, Smt Ratna Reddy, Entrepreneur and Philanthropist from Palamaner, Smt Obulamma, Organic farmer who won National Award will be felicitated on the occasion.

 

The highlight of the day is going to be honouring the Centenarian, Living Legend Doyen and Architect of SPW College Dr K Rajeswari Murty with “Sri Padmavathi Vidya Prakasini ” Award. Dr Murty served as Principal of SPW college between 1954 and 1974 for nearly two decades and brought many reforms and initiatives in the college. As a token for her services, TTD is felicitating her with the unique award.

 

In the evening, dance, skit, epic drama, yoga etc. cultural items will be performed by women employees of TTD. The Padmavathi awards to women employees who showcased extraordinary skills, employees who are going to retire in 2024, and some retired employees who stood exemplary will also be felicitated on the occasion.

 

Upon the instructions of TTD JEO Sri Veerabrahmam, Deputy EO Welfare Smt Snehalata is supervising the arrangements.

 

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI

మార్చి 8న మహతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం

– డా. కె.రాజేశ్వరీ మూర్తికి “శ్రీ పద్మావతి విద్యా ప్రకాశిని” అవార్డు

తిరుపతి, 2023, మార్చి 05: టీటీడీ ఆధ్వర్యంలో మార్చి 8వ తేదీ బుధవారం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగనుంది.

ఉదయం 10 గంట‌ల‌కు కార్యక్రమం ప్రారంభ‌మ‌వుతుంది. వివిధ రంగాల్లో ప్రసిద్ధి చెందిన ఆరుగురు మహిళలు ఈ సందర్భంగా అతిథులుగా విచ్చేయనున్నారు. వీరిలో రాయలచెరువుకు చెందిన శ్రీ శక్తి పీఠాధీశ్వరి మాతాజీ శ్రీ రమ్యానందభారతీ స్వామిని, రేణిగుంట ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చర్ క్లస్టర్ సిఈవో శ్రీమతి గౌతమి, సిఐడి ఎస్పీ శ్రీమతి సరిత ప్రసంగిస్తారు. అదేవిధంగా, చిత్తూరు జిల్లా ఎర్రావారిపాళెం కు చెందిన అంతర్జాతీయ హాకీ క్రీడాకారిణి కుమారి రజనీ, జాతీయ ఉత్తమ మహిళా రైతు పురస్కారాన్ని గెలుచుకున్న ప్రకృతి వ్యవసాయ రైతు శ్రీమతి ఓబులమ్మ, ప్రముఖ పారిశ్రామికవేత్త, రత్న గ్రూపు సంస్థల ఛైర్ పర్సన్ శ్రీమతి రత్నారెడ్డిలను సన్మానిస్తారు.

డా.కె.రాజేశ్వరి మూర్తికి “శ్రీ పద్మావతి విద్యాప్రకాశిని” అవార్డు

శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల రూపశిల్పి అయిన డాక్టర్ కె.రాజేశ్వరి మూర్తి(101)కి టీటీడీ “శ్రీ పద్మావతి విద్యా ప్రకాశిని” అవార్డు ప్రదానం చేయనుంది. ఆమె ఒక లివింగ్ లెజెండ్. 1954 నుండి 1974 వరకు దాదాపు ఇరవై సంవత్సరాల పాటు శ్రీ పద్మావతి కళాశాల ఉన్నతికి విశేషంగా కృషి చేశారు. ఆస్తిలో పెద్ద మొత్తం తన మానస పుత్రిక అయిన శ్రీ పద్మావతి మహిళా కళాశాలకు, పలు ఆసుపత్రులకు దానం చేశారు. శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల, విద్యార్థినులు ఉన్నత శిఖరాలను చేరుకోవడానికి ఆమె అందించిన విశిష్ట సేవలకు గాను టీటీడీ ఈ అవార్డును ప్రదానం చేయనుంది.

ఈ సందర్భంగా టీటీడీ మహిళా ఉద్యోగులు యోగాతో పాటు సామాజిక, పౌరాణిక ప్రదర్శనలు ఇవ్వనున్నారు. శ్రీకృష్ణతులాభారం, నేటిమహిళ స్కిట్ ప్రదర్శించనున్నారు.

అనంతరం వచ్చే ఏడాది ఉద్యోగ విరమణ చేయనున్న మహిళలను సన్మానిస్తారు. పలు విభాగాల్లో విశేష సేవలందించిన మహిళా ఉద్యోగులకు పద్మావతి అవార్డులు ప్రదానం చేస్తారు.

టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం ఆదేశాల మేరకు సంక్షేమ విభాగం డెప్యూటీ ఈవో శ్రీమతి స్నేహలత ఈ కార్యక్రమ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.