UGADI CELEBRATIONS IN MAHATI ON APRIL 2 _ ఏప్రిల్ 2న టిటిడి ఆధ్వర్యంలో మహతిలో ఉగాది సంబరాలు

Tirupati, 26 Mar. 22: In connection with Sri Subhakrut Nama Samvatsara Ugadi on April 2, special programmes will be organised in Mahati Auditorium at Tirupati under the aegis of HDPP and Welfare Departments of TTD. 

 

The celebrations commence with Nadaswaram and Mangaladhwani by the students of SV College of Music and Dance at 9:30am followed by Veda Parayanam.

 

Sri Bala Subrahmanya Shastri, the programme officer of AHDP will render Panchanga Shravanam.

 

Later the children of TTD employees will present the fancy dress of mythological and historical personalities.

 

The prizes will be distributed to the winners of Ugadi competitions followed by the distribution of Ugadi Pacchadi. 

 

ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఏప్రిల్ 2న టిటిడి ఆధ్వర్యంలో మహతిలో ఉగాది సంబరాలు

తిరుపతి, 2022 మార్చి 26: టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, సంక్షేమ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో శ్రీ శుభకృత్‌ నామ సంవత్సర ఉగాది వేడుకలు ఏప్రిల్ 2వ తేదీ తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా జరుగనున్నాయి.

ఉదయం 9.30 గంటలకు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. ముందుగా ఎస్‌.వి.సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో మంగళధ్వని, టిటిడి ఎస్‌.వి ఉన్నత వేదాధ్యయన సంస్థవారిచే వేదపారాయణం నిర్వహిస్తారు. ఈ సంద‌ర్భంగా తిరుప‌తికి చెందిన శ్రీ బాల సుబ్ర‌మ‌ణ్యం శాస్త్రి పంచాంగ శ్రవణం చేస్తారు.

అనంత‌రం టిటిడి ఉద్యోగుల పిల్లలకు వేషధారణ పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తారు. అనంతరం ఉగాది పచ్చడి ప్రసాద వితరణ ఉంటుంది.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.