UNIQUE DANCE FORMS _ గజవాహన సేవలో కళాకారుల కళానీరాజనం

Tirumala, 09 October 2024: It was a display of unique art forms by 408 artists belonging to 16 teams from AP, Karnataka, Telangana, Gujarat and Manipur states at the Mada street as part of Gaja Vahana Seva on Wednesday evening 

The Bharata Natym l by students of Sri Venkateswara College of Music and dance who displayed different forms of the Lord.

Display of the Sri Krishna Leela Ghatam and Dashama Skandam of Bhagavatam stood attractive.

Gajendra Moksha episode, Dasavataram Chinni Krishna along with the Gopikas stood as a cynosure for all.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

గజవాహన సేవలో కళాకారుల కళానీరాజనం

తిరుమ‌ల‌, 2024 అక్టోబ‌రు 09: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు బుధవారం రాత్రి జరిగిన గజవాహన సేవలో టీటీడీ హిందూ ధర్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 16 బృందాలు, 408 మంది కళాకారులు పాల్గొని స్వామివారికి కళానీరాజనం సమర్పించారు.

ఇందులో భాగంగా తిరుపతి శ్రీవేంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే భరతనాట్యం, శ్రీకాకుళంకు చెందిన టి.నీరజ కుమారి, కర్నాటకకు చెందిన జ్యోతి హెగ్డే బృందం, విశాఖపట్నంకు చెందిన మౌనిక బృందాలు ప్రదర్శించిన శ్రీకృష్ణ లీలలు ఘట్టం, భాగవతంలోని దశమ స్కంధము స్ఫురణకు తెచ్చింది.

తిరుపతికి చెందిన డా. లీల బృందం ప్రదర్శించిన గజేంద్ర మోక్షము ఘట్టం నయనానందకరంగా సాగింది.

హైదరాబాదుకు చెందిన జానకి బృందం ప్రదర్శించిన కైకొట్టికేలి అనే కళా రూపం, శాంతిదుర్గా ప్రదర్శించిన బృందావనం, హైదరాబాదుకు చెందిన అల్లం జంపన్న
ప్రదర్శించిన జూమర్ నృత్యం, మణిపురికి చెందిన రవిబొయిదా ప్రదర్శించిన రసలీల, కర్నాటకకు చెందిన అస్త ప్రదర్శించిన కర్నాటక నృత్యం, గుజరాత్ కు చెందిన పార్థసారథి బృందం ప్రదర్శించిన గుజరాతీ నృత్యం భక్తులను ఆకట్టుకున్నాయి.

రాజమండ్రికి చెందిన సునితలక్ష్మీ , విజయవాడకు చెందిన వి.వనజ బృందం, విజయవాడకు చెందిన వైజయంతి మాల, తిరుమలకు చెందిన డి.శ్రీనివాసులు బృందాలు ప్రదర్శించిన కోలాటం తీరు రసజ్ఞత కనబరిచింది.

టీటీడీ ముఖ్య‌ ప్రజాసంబంధాల అధికారిచే విడుద‌ల‌ చేయబడినది.