UNUSED CLOTHES TO BE AUCTIONED_ జూలై 23 నుంచి 30వ తేదీ వరకు టిటిడిలో వినియోగంలో లేని వస్త్రాల ఈ-వేలం
Tirupati, 20 July 2018: TTD is all set auction unused clothes in e-platform from July 23 to 30.
This includes 291 lots of polyester, silk, bed sheets etc.
For more details contact No.0877-2264421/64429.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
జూలై 23 నుంచి 30వ తేదీ వరకు టిటిడిలో వినియోగంలో లేని వస్త్రాల ఈ-వేలం
తిరుపతి, 2018 జూలై 20: టిటిడిలో వినియోగంలో లేని పలురకాల వస్త్రాల ఈ-వేలం జూలై 23 నుండి 30వ తేదీ వరకు జరుగనుంది. టిటిడి మార్కెటింగ్ విభాగంలో 291 లాట్లకు గాను విశాఖపట్నంలోని ఎంఎస్‌టిసి లిమిటెడ్ ఈ-ప్లాట్‌ఫాంపై ఈ-వేలం నిర్వహిస్తారు. అదేవిధంగా ఆగస్టు 23 నుండి 30వ తేదీ వరకు రెండో విడతలో 283 లాట్లకు ఈ-వేలం జరుపుతారు.
ఇందులో పట్టు, కాటన్, పాలిస్టర్ చీరలు, పంచలు, ఉత్తరీయాలు, టర్కీ టవళ్లు, లుంగీలు, శాలువలు, బెడ్‌షీట్లు, పిల్లో కవర్లు, రెడీమేడ్ వస్త్రాలు ఉన్నాయి. వీటితోపాటు బంగారు వాకిలి పరదాలు, కాకి పరదాలు, హుండీ గల్లేబులు, పవిత్రాలు, బ్లౌజ్ పీస్‌లు తదితర వస్త్రాలు ఉన్నాయి.
ఇతర వివరాల కోసం మార్కెటింగ్ విభాగం జనరల్ మేనేజర్(వేలం)వారి కార్యాలయాన్ని 0877-2264429 లేదా 2264221 ఫోన్ నంబర్లలో గానీ, www.mstcecommerce.com/ www.mstcindia.co.in / www.tirumala.org వెబ్‌సైట్లను గానీ సంప్రదించగలరు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.