JAYATHEERTHA ARADHANOTSAVAMS IN AUGUST_ ఆగస్టు 1 నుండి తిరుమలలో శ్రీ జయతీర్ధుల ఆరాధనోత్సవం

Tirumala, 20 July 2018: The Aradhanotsavams of Sri Jayatheetha will be observed from August 1 to 3 in Kalyana Vedika at Tirumala under the aegis of Dasa Sahitya Project of TTD.

During these three days, there will be religious discourses by the pontiffs of various mutts, followed by Kannada Dasa Sankeertanas etc.

Every day nearly 3000 Dasaparas from AP, TS, TN, Karnataka will take part in this fete.

Sri Suvidyendra Theertha Swamy of Sri Raghavendra Mutt, Bengaluru, Sri Raghuvarendra Theertha Swamy of Teerthahalli Bheemasethu Munivrinda Mutt, Sri Vidyavallabha Theertha Swamy of Kanyuru Mutt, Udipi will render Anugraha Bhashanam on August 1, 2 and 3 respectively.

Dasa Sahitya Project Special Officer Dr P Ananda Theerthacharyulu is supervising the arrangements.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ఆగస్టు 1 నుండి తిరుమలలో శ్రీ జయతీర్ధుల ఆరాధనోత్సవం

జూలై 20, తిరుమల 2018: ఆగస్టు 1 నుండి 3వ తేదీ వరకు టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుమలలోని కళ్యాణ వేదికలో శ్రీ జయతీర్ధుల ఆరాధనోత్సవాలు ఘనంగా జరుగనుంది.

ఇందులోభాగంగా ప్రతిరోజు కళ్యాణ వేదికలో ఉదయం 5.30 నుండి 7.00 గంటల వరకు ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 3000 మంది భజనమండళ్ల కళాకారులతో సుప్రభాతం, ధ్యానం, అనంతరం పీఠాధిపతులు మంగళాశాసనములు ఉన్నాయి. ఉదయం 8.30 నుండి 10.30 గంటల వరకు దాస సాహిత్య కళాకారులతో ” శ్రీ జయతీర్థుల సంకీర్తన”, ఉదయం 10.30 నుండి 12.30 గంటల వరకు పండితులతో ఆధ్యాత్మిక సందేశాలు ఉన్నాయి. మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 5.30 గంటల వరకు సామూహిక సంకీర్తన – సంగీత విభావరి కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఈ సందర్భంగా ఆగస్టు 1వ తేదీ బెంగుళూరు శ్రీ రాఘవేంద్ర మఠముకు చెందిన శ్రీశ్రీశ్రీ సువిద్యేంద్రతీర్థ స్వామీజీ, ఆగస్టు 2వ తేదీ తీర్థహళ్ళి భీమసేతు మునివృంద మఠముకు చెందిన శ్రీశ్రీశ్రీ రఘువరేంద్రతీర్థ స్వామీజీ, ఆగస్టు 3వ తేదీ ఉడిపిలోని కాణ్యూర్‌ మఠముకు చెందిన శ్రీశ్రీశ్రీ విద్యావల్లభతీర్థ స్వామీజీలు మంగళాశాసనములు ఇవ్వనున్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.