UPAMAKA SRIVARI BRAHMOTSAVAMS FROM SEPTEMBER 18 TO 27 _ 18 నుంచి ఉపమాక శ్రీవారి బ్రహ్మోత్సవాలు

Tirupati, 5 Sep. 20: The annual Brahmotsavam of Sri Venkateswara Swamy temple at Upamaka in Visakhapatnam district will be celebrated from September 18-27 this year in Ekantam in view of COVID 19 restrictions. 

The highlights of the Brahmotsavam events include Sri Viswaksena Aradhana and Kankanadharana with Ankurarpanam on September 18, Dhwajarohanam on September 19 and the festivities conclude on September 27.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

18 నుంచి ఉపమాక శ్రీవారి బ్రహ్మోత్సవాలు

తిరుపతి, 05 సెప్టెంబరు 2020: విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో సెప్టెంబరు 18 నుంచి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

18వ తేదీ శుక్రవారం సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు శ్రీ విష్వక్సేన ఆరాధన, కంకణధారణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. 19వ తేదీ శనివారం రాత్రి 8 గంటల నుంచి 9.30 గంటల వరకు ధ్వజారోహణం నిర్వహిస్తారు. 27వ తేదీ ఆదివారంతో ఉత్సవాలు ముగుస్తాయి. కోవిడ్ 19 వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలు రద్దు చేశారు. మూల విరాట్, పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమాలన్నీ ఏకాంతంగా నిర్వహిస్తారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.