VAKULAMATA TEMPLE ANNIVERSARY CELEBRATIONS _ జూన్ ౩౦న వకుళమాత ఆలయ వార్షికోత్సవం

TIRUPATI, 26 JUNE 2024: TTD is all set to observe the anniversary fete of Vakulamata temple located at Perurubanda near Tirupati on June 30.
 
As a part of the fete, Mahashanti Homam, Purnahuti willl be performed at 8am while Astottara Sata kalasabhishekam between 11am and 12 noon.
 
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

జూన్ ౩౦న వకుళమాత ఆలయ వార్షికోత్సవం

తిరుపతి, 26 జూన్ 2024: తిరుపతి సమీపంలోని పాత కాల్వ వద్ద పేరూరు బండపై ఉన్న శ్రీ వకుళమాత ఆలయంలో జూన్ 30వ తేదీ వార్షికోత్సవ ఉత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగనున్నాయి.

ఇందులో భాగంగా ఉదయం 8 గంటలకు మహాశాంతి హోమం, పూర్ణాహుతి నిర్వహిస్తారు. అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారి ఉత్సవర్లకు అష్టోత్తర కలశాభిషేకం జరుగనుంది.

ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, భక్తులు పాల్గొంటారు.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.