VAKULAMATA TEMPLE TO BE DEVELOPED AS A DIVYA KSHETRAM _ వకుళ మాత ఆలయాన్ని దివ్య క్షేత్రంగా అభివృద్ధి చేస్తాం

TIRUMALA, 12 JUNE 2022: The temple dedicated to Vakulamata, the foster mother of Sri Venkateswara which is getting renovated at Perur will be developed into a Divya Kshetram said the Honourable Minister Sri P Ramachandra Reddy.

He said the Honourable CM of AP Sri YS Jaganmohan Reddy will take part in the Maha Samprokshanam of the temple on June 23.

After inspecting the ongoing temple works in the site along with TTD EO Sri AV Dharma Reddy on Sunday evening, the Minister said, under the instructions of the CM of AP renovation and reconstruction works has been taken up by TTD on a war-footing basis in the last two years.

Arrangements will be made that the devotees visit Vakulamata temple after darshan of Tiruchanoor Padmavathi Ammavaru.

ZP Chief Sri Srinivasulu, TTD Board members Sri Ashok Kumar, Sri Ramulu, JEO Sri Veerabrahmam and others were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వకుళ మాత ఆలయాన్ని దివ్య క్షేత్రంగా అభివృద్ధి చేస్తాం
– జూన్ 23న మహాసంప్రోక్షణలో ముఖ్యమంత్రి పాల్గొంటారు
– పనులను పరిశీలించిన మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టీటీడీ ఈవో శ్రీ ధర్మారెడ్డి

తిరుపతి 12 జూన్ 2022: తిరుపతి రూరల్ మండలం పేరూరు వద్ద పునర్నిర్మిస్తున్న శ్రీ వకుళ మాత ఆలయాన్ని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. జూన్ 23వ తేదీ జరిగే ఆలయ మహాసంప్రోక్షణ లో ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొంటారని ఆయన తెలిపారు.

టీటీడీ ఈవో శ్రీ ధర్మారెడ్డి తో కలసి ఆదివారం సాయంత్రం ఆయన వకుళ మాత ఆలయంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏర్పాట్లపై వీరిద్దరూ అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు.
అనంతరం మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో వకుళ మాత ఆలయ పునర్నిర్మాణం లో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయం తీసుకుని వెళ్ళాననీ ఆలయ పునర్నిర్మాణానికి సంబంధించి ఆయన టీటీడీ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీచేశారని చెప్పారు. ఆలయాన్ని రాష్ట్రంలోని ముఖ్య ఆలయాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని మంత్రి వివరించారు. ఆలయ పునర్నిర్మాణంలో పని చేసిన అధికారులు, సిబ్బందిని ఆయన అభినందించారు.

ఈవో శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ, శ్రీ వకుళ మాత ఆలయ పునర్నిర్మాణం లో మంత్రి శ్రీ రామచంద్రారెడ్డి ఎంతో కృషి చేశారని చెప్పారు. తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న భక్తులు తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి తో పాటు శ్రీ వకుళ మాతను కూడా దర్శించుకునేలా ఏర్పాటు, ప్రచారం చేస్తామని చెప్పారు.ఇక్కడ ఉద్యాన వనాలు అభివృద్ధి చేయడం తో పాటు మొక్కలు పెంచుతామని, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామన్నారు.

జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీ శ్రీనివాసులు, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ.పోకల అశోక్ కుమార్, శ్రీ మురం శెట్టి రాములు, జెఈవో శ్రీ వీరబ్రహ్మం తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.