PATTABHISEKA MAHOTSAVAMS OF SRI PATTABHIRAMA SWAMY TEMPLE, VALMIKIPURAM FROM AUG 5-7 _ ఆగస్టు 5 నుండి 7వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు
Tirupati, August 4, 2019: The Annual Pattabhiseka Mahotsavam of TTD local temple Sri Pattabhirama Swamy Temple, Valmikipuram will be grandly conducted from August 5 to 7 with the Senadhipati utsavam on the first day.
On the Second day August 6 morning yagashala puja and snapana thirumanjanam to utsava idols, will be performed and unjal Seva, Sri Sitarama Kalyanam, followed by Hanumantha vahana seva in the night.
On Day-3, August 7 Srirama Pattabhisekam is grandly conducted after morning ritual of snapana thirumanjanam that will be followed by unjal seva in the evening and the majestic Garuda vahana Seva of Sri Pattabhirama. Later on Maha purnahuti. Kumba udwasana and Kumbha prokshana are performed. Interested devotee couple could participate with a ticket of Rs.300 and beget uttarium, blouse and anna prasadam as blessings.
On all the three days the artists of HDPP and Annamacharya project would present bhakti sangeet, kolatas and bhajans at Valmikipuram temple premises.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
ఆగస్టు 5 నుండి 7వ తేదీ వరకు వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు
తిరుపతి, 2019 ఆగస్టు 4: టిటిడికి అనుబంధంగా ఉన్న చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామస్వామివారి పట్టాభిషేక మహోత్సవాలు ఆగస్టు 5 నుండి 7వ తేదీ వరకు ఘనంగా జరుగనున్నాయి. ఆగస్టు 5న అంకురార్పణంతో ఉత్సవాలు ప్రారంభంకానున్నాయి. మొదటిరోజు సేనాధిపతి ఉత్సవం జరుగనుంది.
ఆగస్టు 6వ తేదీన ఉదయం యాగశాల పూజ, స్నపనతిరుమంజనం ఘనంగా నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు ఊంజల్‌సేవ, 7 గంటలకు శ్రీ సీతారామ శాంతి కళ్యాణం, రాత్రి 9గంటలకు హనుమంత వాహనసేవ నిర్వహించనున్నారు.
ఆగస్టు 7న ఉదయం యాగశాల పూజ, స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. అనంతరం శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం వైభవంగా జరుగనుంది. రాత్రి 6 గంటలకు ఊంజల్ సేవ, రాత్రి 7.30 గంటలకు గరుడ వాహనంపై శ్రీపట్టాభిరాముడు విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు. అనంతరం మహాపూర్ణాహుతి, కుంభోద్వాసన, కుంభప్రోక్షణం నిర్వహించనున్నారు.
గృహస్తులు(ఇద్దరు) రూ.300/- చెల్లించి శ్రీరామ పట్టాభిషేకం ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు.
ఈ మూడు రోజుల పాటు టిటిడి హిందూధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో హరికథలు, భజనలు, ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు జరుగనున్నాయి.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.