VARAHA JAYANTHI OBSERVED_ తిరుమలలో ఘనంగా శ్రీ వరాహస్వామి జయంతి

Tirumala, 12 September 2018: Varaha Jayanthi has been observed with religious fervour in Adi Varaha Kshetra on Wednesday.

As per temple legend, Sri Varaha Swamy granted a piece of land to Sri Venkateswara to stay in Tirumala and in a thanks giving gesture Lord Venkateswara in turn has given the privilege of offering first prayers and naivedyam to Sri Varaha Swamy.

Sri Varahasawamy temple is located to the North of Srivari temple on the banks of Swamy Pushkarani. On Wednesday, Kalasapuja and Kalasa Sthapana were performed followed by Punyahavachanam. Later Panchamritabhishekam is performed to the presiding deity of Sri Bhi Varaha Swamy between 9am and 10am.

TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju were also present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

తిరుమలలో ఘనంగా శ్రీ వరాహస్వామి జయంతి

తిరుమల, 2018 సెప్టెంబరు 12: ఆదివరాహక్షేత్రమైన తిరుమలలోని శ్రీ భూ వరాహస్వామివారి ఆలయంలో బుధవారం ఉదయం వరాహ జయంతి ఘనంగా జరిగింది.

ఇందులో భాగంగా ఉదయం కలశస్థాపన, కలశ పూజ, పుణ్యహవచనం చేశారు. ఉదయం 9 నుంచి 10 గంటల మధ్య పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లు, వివిధ రకాల పండ్లతో తయారుచేసిన పంచామృతంతో వేదోక్తంగా మూలవర్లకు అభిషేకం నిర్వహించారు.

కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో అగమ శాస్త్రం ప్రకారం ప్రతి సంవత్సరం శ్రీవరాహస్వామి జయంతిని టిటిడి ఘనంగా నిర్వహిస్తోంది. స్థలమహత్యం ప్రకారం తిరుమలలో తొలి పూజ, తొలి నివేదన శ్రీ వరాహస్వామివారికే చేస్తారు. భక్తులు ముందుగా శ్రీభూవరాహస్వామి వారిని, ఆ తరువాత శ్రీవారిని దర్శించుకోవడం ఆచారం. శ్రీ మహావిష్ణువు లోక కల్యాణం కోసం శ్రీ వరాహస్వామివారి అవతారమెత్తి హిరణ్యాక్షుని సంహరించి భూదేవిని రక్షించినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది.

ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీకె.ఎస్‌.శ్రీనివాసరాజు ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.