VARALAKSHMI VRATAM FETE AT TIRUCHANOOR TEMPLE ON AUGUST 16 _ ఆగష్టు 16న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీవ్రతం

Tirupati,09 August 2024: TTD is organising the grand Varalakshmi Vratam festival at Sri Padmavati temple Tiruchanoor on August 16 with many cultural programs besides Abhishekam to Utsava idols and the presiding deity in the morning.

The officials are making all arrangements for conducting the Varalakshmi Vratam at the Asthana Mandapam of the temple between 10am and 12noon.

Grihastas participating in the vratam will Be presented one uttariyam, one blouse, one laddu and vada as Prasadam.

Later in the evening, Ammavaru will ride on Swarna Ratham on the Mada streets to bless devotees.

In view of the grand fete, TTD has cancelled Arjita Sevas like Abhishekam, Abhisekanantara Darshanam, Lakshmi Puja,  Kumkumarchana, Vedashirvachanam break Darshan, Sahasra Deepalankara seva.

The Darshan of Sri Padmavati in Varalakshmi Alankaram and rituals held as per Pancharatra Agama Shastra ensures prosperity, health and happiness to all devotees.

After day long pujas and Abhisekam, archakas recite the holy Vrata Mahatmya Katha in the finale.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఆగష్టు 16న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీవ్రతం

తిరుప‌తి‌, 2024 ఆగ‌స్టు 09: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగష్టు 16వ తేదీ శుక్రవారం వరలక్ష్ష్మీ వ్రతం వైభవంగా జరుగనుంది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా తెల్లవారుజామున మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించనున్నారు.

ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలోని ఆస్థాన మండపంలో వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరుగనుంది. వ్రతం నిర్వహణ కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వ్రతంలో పాల్గొన్న గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వ్రతం కారణంగా అమ్మవారి ఆలయంలో ఆర్జితసేవలైన అభిషేకం, అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, వేదాశీర్వచనం, బ్రేక్ దర్శనం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.

మహామంగళ దేవత, లక్ష్మీ అవతారమైన అలమేలు మంగమ్మ తిరుచానూరు ఆలయంలో జగత్కల్యాణం కోసం అవతరించిన సౌభాగ్యదేవత. తిరుచానూరులో చేసే వరలక్ష్మీ వ్రతంలో పాల్గొన్న భక్తులకు విశేషమైన ఫలాలు చేకూరుతాయి. వ్రతం చేసే రోజున ఉదయాన్నే మంగళ స్నానం చేసి, నూతన వస్త్రాలు ధరించి ఆలయంలో అర్చకులు ఏర్పాటుచేసిన మంటపంలో కొలువైన వరలక్ష్మీ దేవిని దర్శించాలి. అర్చకులు మంటపంలో ముగ్గులలో కమలాన్ని ఏర్పాటు చేస్తారు. దాని మధ్యలో కలశాన్ని ఉంచి, దానిపై నారికేళ ఫలాన్ని పెట్టి, దానికి చెవులు, కన్నులు, ముక్కు ఏర్పాటుచేసి ఆభరణాలను అలంకరిస్తారు. లక్ష్మీమాతను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అర్చకులు ఆవాహనం చేసి షోడశోపచార పూజలు చేస్తారు. రక్ష కట్టిన తరువాత పసుపు, కుంకుమ, పూలతో వ్రతాన్ని సుసంపన్నం గావించి, వ్రతమహత్యం కథను కూడా చక్కగా పఠించడం జరుగుతుంది.

టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.