VASANTHA PANCHAMI SARASWATHI POOJA TO ENHANCE WISDOM AMONG CHILDREN -TTD CHAIRMAN _ ఎస్వీబీసీ ద్వారా విద్యార్థుల కోసం భాగవత, భారత కార్యక్రమాలు టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

COMMITTED TO TAKE UP MORE DHARMIC ACTIVITIES IN A MASSIVE WAY

 Nellore, 16 February 2021: Propagation of Hindu Sanatana Dharma in a big way to enhance traditional values especially among youth and children is the chief motto of TTD, said TTD Chairman Sri YV Subba Reddy.

Speaking on the occasion of Vasantha Panchami Saraswati Puja observed in a big manner at the spacious AC Subba Reddy stadium in Sri Potti Sriramulu Nellore District on Tuesday evening the TTD Chairman highlighted other dharmic activities taken by TTD during the last one year with the SVBC channel as a medium of Sanatana Dharma propagation, like Karthika masa, Dhanurmasa festivities, Parayanams, homams, Gudiko Gomata program etc.

He said people participated in a huge number at festivals organised by TTD in all these festivities with utmost devotion and hailed the spiritual programs live telecasted on SVBC. 

He said, TTD is now organising the Sri Panchami or Vasantha Panchami to seek blessings of Goddess Saraswati on all youth and students to prosper in their career.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నేటి యువ‌త‌కు భార‌తీయ స‌నాత‌న విలువ‌లు తెల‌పాలి
– విద్య, వైద్య కోసం సి ఎం చేపట్టిన కార్యక్రమాలకు అమ్మవారి ఆశీస్సులుండాలి

– ఎస్వీబీసీ ద్వారా విద్యార్థుల కోసం భాగవత, భారత కార్యక్రమాలు

టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి

నెల్లూరు , 2021 ఫిబ్రవరి 16: సనాతన హిందూ ధార్మిక విలువలు, ప్రపంచానికి విజ్ఞానం అందించిన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను నేటి తరం యువత‌కు గుర్తు చేయ‌డానికి, ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి విద్యా రంగం కోసం అమలు చేస్తున్న కార్యక్రమాలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుతూ వసంత పంచమి కార్యక్రమం నిర్వహించామని టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి చెప్పారు.

నెల్లూరు ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో మంగ‌ళ‌వారం రాత్రి వసంత పంచమి (స‌ర‌స్వ‌తిదేవి పూజ‌) మహోత్సవం టిటిడి వైభ‌వంగా నిర్వ‌హించింది.

ఈ సంద‌ర్భంగా ఛైర్మ‌న్ మాట్లాడుతూ కోవిడ్ నుంచి ప్రజలను కాపాడాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తూ సుందరకాండ పారాయణం, విరాటపర్వం లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అమ్మ వడి, విద్యాదీవెన, నాడు నేడు లాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమాలకు సరస్వతి అమ్మవారు, శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని ఈ కార్యక్రమం నిర్వహించామని ఆయన చెప్పారు.

ఎస్వీబీసీ ద్వారా విద్యార్థుల కు అర్ధమయ్యే రీతిలో భాగవత, మహాభారతం కార్యక్రమాలు రూపొందించి ప్రసారం చేస్తామని చెప్పారు. సరస్వతి దేవి పూజకు దాతలుగా వ్యవహరించిన వేమిరెడ్డి దంపతులకు అమ్మవారి ఆశీస్సులు లభించాలని ఆయన కోరారు.

ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఏడాదిన్నర కాలంగా పెద్ద ఎత్తున హిందూధర్మ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంద‌న్నారు. ఇందులో భాగంగా కార్తీక, ధనుర్మాసాల్లో అనేక కార్యక్రమాలు నిర్వహించింద‌న్నారు.

మాఘమాసాన్ని పురస్కరించుకుని టిటిడి మాఘ మాస మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభించింద‌ని చెప్పారు. ఈ కార్యక్రమాల్లో భాగంగానే మంగ‌ళ‌వారం నెల్లూరు ఎసి సుబ్బారెడ్డి స్టేడియంలో వసంత పంచమి మహోత్సవం ఘ‌నంగా నిర్వహించిన‌ట్లు చెప్పారు.

శ్రీ సరస్వతీ దేవి అనుగ్రహం వల్ల విద్యార్థులందరికీ మంచి విద్యాబుద్ధులు ప్రసాదించాలని, అన్ని కార్యక్రమాలు విజయవంతం కావాలని శ్రీ సుబ్బారెడ్డి ప్రార్థించారు.

ఉప ముఖ్యమంత్రి శ్రీ కె. నారాయణ స్వామి, రాజ్య‌స‌భ స‌భ్యులు శ్రీ వేమిరెడ్డి ప్ర‌భాక‌ర్ రెడ్డి, టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి , శాస‌న స‌భ్యులు శ్రీ వెలగపల్లి వరప్రసాదరావు, టిటిడి అద‌నపు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి దంపతులు, జిల్లా క‌లెక్ట‌ర్ శ్రీ చ‌క్ర‌ధ‌ర్‌బాబు దంపతులు, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ‌మ‌తి వేమిరెడ్డి ప్ర‌శాంతి రెడ్డి, సివిఎస్వో శ్రీ గోపినాథ్‌జెట్టి త‌దిత‌రులు పాల్గొన్నారు.

డిప్యూటీ సిఎం కు సన్మానం

వేదిక మీద డిప్యూటీ సి ఎం శ్రీ కె.నారాయణ స్వామిని , కార్యక్రమం దాతలైన ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి శాలువతో సన్మానించారు. టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని టీటీడీ ఛైర్మన్ శ్రీ వైవి స్వర్ణలత రెడ్డి శాలువతో సన్మానించారు.

వేడుకగా సరస్వతి పూజ

సరస్వతి పూజకు ముందుగా పండితులు వేద పఠనం చేశారు. అనంతరం గ‌ణ‌ప‌తి పూజ‌ నిర్వహించి, కార్యక్రమానికి హాజరైన వారందరితో సంకల్పం చేయించారు. తర్వాత స‌ర‌స్వ‌తి పూజ క‌న్నుల పండువ‌గా నిర్వహించారు. కోవిడ్ నేప‌థ్యంలో భౌతిక‌దూరం పాటిస్తూ మ‌హిళ‌లు కూర్చుని దీపాలు వెలిగించేలా దీప‌పు దిమ్మెలు, నేతి వ‌త్తులు ఏర్పాటుచేశారు. మైదానం మొత్తం తివాచీలు ఏర్పాటుచేశారు.

వేదిక‌ను శోభాయ‌మానంగా పుష్పాల‌తో, విద్యుత్ దీపాల‌తో అలంక‌రించారు. వేదిక మీద వీణా వాణి రూపంలో సరస్వతి దేవిని అలంకరించారు. ఇరువైపులా ఆక‌ట్టుకునేలా సెట్టింగ్ ఏర్పాటుచేశారు. స్టేడియం ప్ర‌ధాన ద్వారాల నుంచి ఆవ‌ర‌ణం మొత్తం అర‌టి చెట్లు, పూలు, విద్యుద్దీపాల‌తో అలంక‌రించారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ ఫణి నారాయణ బృందం 16 మంది కళాకారులతో చేసిన వీణా నాదం, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు సరస్వతి దేవిని కీర్తిస్తూ చేసిన నృత్య ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకున్నాయి.

అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు అల‌పించిన సంకీర్త‌న‌లు భక్తుల‌ను ఆక‌ట్టుకున్నాయి.

కార్యక్రమంలో చివరగా మహిళలు గోవింద నామ స్మరణ చేస్తూ సామూహికంగా దీపాలు వెలిగించారు..

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.