VASANTHOTSAVAM HELD _ శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకగా వసంతోత్సవం

TIRUPATI, 04 DECEMBER 2021: On the fifth day afternoon, Vasanthotsavam also known as Upasamanotsavam was held in the shrine of Tiruchanoor as part of ongoing annual Brahmotsavams on Sunday evening.

Goddess Padmavathi was rendered abhishekam with sandal and other aromatic liquids to give a soothing feel after a hectic morning and evening Vahana sevas from the last five days.

GOLD KARNAPATRAMS DONATED

A Mumbai based devotee, Sri Shankar Narayan had donated Rs. 6lakhs worth 77gms weighing golden Karnapatrams on Saturday.

Temple DyEO Smt Kasturi Bai, AEO Sri Prabhakar Reddy, Superintendent Sri Seshagiri were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వేడుకగా వసంతోత్సవం

తిరుపతి, 2021 డిసెంబ‌రు 04: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక‌ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయంలో శనివారం సాయంత్రం వసంతోత్సవం ఏకాంతంగా జరిగింది. కంకణభట్టార్ శ్రీ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ఈ ఉత్సవం జరిగింది.

బ్రహ్మోత్సవాల్లో ఉదయం, సాయంత్రం వాహనసేవల్లో పాల్గొని అలసిపోయిన అమ్మవారికి ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవం నిర్వహించారు. దీనిని ఉపశమనోత్సవం అని కూడా అంటారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతోపాటు పలురకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం చేశారు. వసంతోత్సవంలో పాల్గొన్న తరువాత అమ్మవారు గజవాహనంపై భక్తులకు దర్శనమిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.