విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి తిరుమల జెఈఓ పట్టువస్త్రాలు సమర్పణ
విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి తిరుమల జెఈఓ పట్టువస్త్రాలు సమర్పణ
తిరుమల, 2018 డిసెంబరు 08:పవిత్రమైన మార్గశిర మాసం ప్రారంభాన్ని పురస్కరించుకుని టీటీడీ తిరుమల జెఈఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు శనివారం విశాఖపట్నంలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.
ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న జెఈఓ దంపతులకు ఆలయ ఈవో శ్రీమతి జ్యోతి మాధవి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం జెఈఓ అమ్మవారిని దర్శించుకున్నారు. విశిష్టమైన మార్గశిర మాసంలో ప్రతిరోజూ వేల సంఖ్యలో భక్తులు ఇక్కడి అమ్మవారిని దర్శించుకుంటారు. జనవరి 5 తేదీ వరకు మార్గశిర మాసం ఉంటుందని ఆలయ అధికారులు తెలియజేశారు. జెఈఓ వెంట శ్రీవారి ఆలయ ఓ ఎస్ డి శ్రీ పాల శేషాద్రి ఉన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.