VASANTHOTSAVAM OBSERVED_ వైభ‌వంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవం

Tiruchanoor, 8 Dec. 18After a day of hectic activity, the goddess was rendered vasanthotsavam at Sri Krishna Swamy Mukha mandapam.

This is also known as Srmapariharotsavam or Upasamanotsavam.

After Vasanthotsavam, the holy water with which Tirumanjanam was performed was sprayed on the devotees.

UNJAL SEVA PERFORMED

Later in the evening, unjal seva was performed where in the Goddess was decked with colourful silk vastrams and dazzling jewels and swing fete is conducted.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వైభ‌వంగా శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవం

డిసెంబరు 08, తిరుప‌తి, 2018: సిరులతల్లి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ‌నివారం సాయంత్రం 3.00 నుండి 5.00 గంటల వరకు వసంతోత్సవాలు వైభ‌వంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా ఆల‌యంలో ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

ఇందులో భాగంగా శ్రీ ప‌ద్మావ‌తి అమ్మవారి ఉత్సవమూర్తికి మధ్యాహ్నం 3.00 నుండి 5.00 గంటల వరకు అమ్మవారి ఆలయంలోని ముఖ మండపంలో వసంతోత్సవం వేడుకగా జరిగింది.

ఈ సంద‌ర్భంగా టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలలో శ్రీ పద్మావతి అమ్మవారు ఉద‌యం, సాయంత్రం అలంకరణలు, వాహనసేవల్లో పాల్గొని అలసి వుంటారు కావున అమ్మవారు ఉపశమనం కల్పించేందుకు వసంతోత్సవాలు నిర్వహించిన‌ట్లు తెలిపారు. వసంతోత్సవంలో భాగంగా చందనంతోపాటు పలురకాల సుగంధ పరిమళ ద్రవ్యాలతో అమ్మవారికి విశేషంగా అభిషేకం నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. వ‌సంతోత్స‌వాల అనంత‌రం అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వ‌హించిన‌ట్లు తెలిపారు. అమ్మ‌వారి ఆల‌యంలో మార్గశిర మాసం పాడ్యమి రోజున వసంతోత్సవం నిర్వహిస్తార‌న్నారు. కాగా వసంతోత్సవంలో పాల్గొన్న తరువాత అమ్మవారు రాత్రి గజవాహనంపై భక్తులకు దర్శనమిస్తార‌న్నారు. అదేవిధంగా డిసెంబ‌రు 9వ తేదీ సాయంత్రం 4.00 గంట‌లకు స్వ‌ర్ణ‌ర‌థోత్స‌వం, రాత్రి గ‌రుడ‌వాహ‌నంపై అమ్మ‌వారు ఊరేగి భ‌క్తుల‌ను క‌టాక్షించ‌నున్న‌ట్లు తెలిపారు. డిసెంబ‌రు 12వ తేదీ పంచ‌మితీర్థానికి వ‌చ్చే భ‌క్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూలైన్లు, అన్న‌ప్ర‌సాదం కౌంట‌ర్లు, తాత్కాలిక మ‌రుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్న‌ట్టు చెప్పారు.

అనంత‌రం అర్చకులు, భక్తులు అహ్లాదకరంగా వసంతాలు ( గంథం కలిపిన నీళ్ళు) చల్లుకున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్‌, ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీమ‌తి ఝాన్సీరాణి , సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ సుబ్ర‌మ‌ణ్యం, ఇతర ఉన్నతాధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.