ఫిబ్రవరి 12న నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో రథసప్తమి

ఫిబ్రవరి 12న నాగలాపురం శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో రథసప్తమి

తిరుపతి, 2019 ఫిబ్రవరి 05: టిటిడికి అనుబంధ ఆలయమైన నాగలాపురంలోని శ్రీ వేదనారాయణస్వామివారి ఆలయంలో రథసప్తమి పర్వదినం కోసం విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

ఇందులో భాగంగా శ్రీ వేదనారాయణస్వామివారు వివిధ వాహనాలపై ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు.

వాహనసేవల వివరాలు

సమయం వాహనం

ఉ. 6.00 – ఉ. 7.30 సూర్యప్రభ వాహనం

ఉ. 8.00 – ఉ. 9.30 హంసవాహనం

ఉ. 9.30 – ఉ. 10.00 తిరుచ్చి ఉత్సవం

ఉ. 10.30 – మ. 12.00 కల్పవృక్ష వాహనం

సా. 4.00 – సా. 5.30 పెద్దశేష వాహనం

సా. 6.30 – రా. 8.00 చంద్రప్రభ వాహనం

ఈ సందర్భంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్‌, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజూ హరికథలు, సంగీత కచేరీలు ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.