PURANDHARA DASA FETE CONCLUDES_ ముగిసిన శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

Tirupati, 5 Feb. 19: The annual aradhana mahotsavams of Kannada Saint Poet Sri Purandharadasa concluded in Tirumala and Tirupati on Tuesday.

The day commenced with Suprabhata parayanam, community singing of various Dasa keertans in praise of Sri Venkateswara Swamy by 3000 odd Dasa Bhajan members at Asthana Mandapam in Tirumala on Tuesday.

The event was supervised by special officer of Dasa Project Sri Ananda Theerthacharya.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs TIRUPATI
ముగిసిన శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు

తిరుమల, 05 ఫిబ్రవరి 2019: తిరుమలలో మూడు రోజుల పాటు జరిగిన శ్రీ పురందరదాసుల ఆరాధనా మహోత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి.

ఈ సందర్భంగా ఆస్థానమండపంలో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తనం, ఆ తరువాత హరిదాస రంజని కళాకారులతో సంగీత కార్యక్రమం నిర్వహించారు.

టిటిడి దాససాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుండి 3000 మందికి పైగా భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.