VEDIC STUDENTS GET DIVINE BLESSINGS _ శ్రీవారిని దర్శించుకున్న వేద విద్యార్థులు
Tirumala, 03 January 2025: The Vedic students of Dharmagiri Veda Vignana Peetham at Tirumala had Darshan of Sri Venkateswara Swamy on Friday.
The Additional EO Sri Ch Venkaiah Chowdary has arranged Darshan to the students who performed the holy Dhanurmasa Vratam in their Peetham.
Earlier, the students along with their faculty performed Sri Vishnu Sahasra Nama Parayana Gosti along the four mada streets encircling the temple under the directives of the Principal Sri KSS Avadhani.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీవారిని దర్శించుకున్న వేద విద్యార్థులు
తిరుమల, 2025 జనవరి 03: తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలోని వేద విద్యార్థులు శుక్రవారం శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
పవిత్ర ధనుర్మాసంలో తమ పీఠంలో విద్యార్థులు ధనుర్మస వ్రతం ఆచరించిన సందర్బంగా అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి వారికి దర్శన ఏర్పాట్లు చేశారు.
అంతకు ముందు వేద విజ్ఞాన పీఠం ప్రధానోపాధ్యాయులు శ్రీ కెఎస్‌ఎస్ అవధాని ఆధ్వర్యంలో విద్యార్థులు తమ అధ్యాపకులతో కలిసి శ్రీవారి ఆలయ ప్రదక్షిణగా నాలుగు మాడ వీధుల్లో శ్రీవిష్ణుసహస్ర నామ పారాయణ గోష్టి చేశారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.