VENKATESWARA VAIBHAVOTSAVAMS TO COMMENCE FROM AUGUST 16 AT NELLORE _ నెల్లూరులో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలకు సర్వం సిద్ధం

PRELIMINARY RITUALS PERFORMED

 

TIRUPATI, 15 AUGUST 2022: Stage set for Sri Venkateswara Vaibhavotsavams in the AC Subba Reddy stadium at Nellore from August 16 -20.

 

As a festival of prelude, Vastu Homam, Panchagavya Prokshana, Bimba Suddhi, Veedhi Utsavam were performed on Monday.

 

On August 16, the day commences with Suprabatham at 6am followed by Tomala and Koluvu between 6:30am and 7:30am, Archana upto 8:15am, Nivedana, Sattumora till 8:30am, Astadala Pada Padmaradhana between 8:30am and 9:30am, second Nivedana till 10am followed by Vasanthotsavam.

 

The Sarva Darshanam is open for devotees till 5:30pm.

 

In the evening, Sahasra Deepalankara Seva between 5:30pm and 6:30pm, Veedhi Utsavam till 7:30pm, night Kainkaryams till 8:30pm will be observed. The rituals for the day concludes with Ekanta Seva at 9pm.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నెల్లూరులో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలకు సర్వం సిద్ధం

– వైదిక క్రతువులు ప్రారంభం

తిరుపతి, 2022, ఆగస్టు 15: నెల్లూరులోని ఎసి.సుబ్బారెడ్డి స్టేడియంలో ఆగస్టు 16 నుండి 20వ తేదీ వరకు జరుగనున్న శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలకు సర్వం సిద్ధమైంది. తిరుమల ఆలయంలో రోజువారీ నిర్వహించే సేవలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా టిటిడి శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తోంది.

ఈ ఉత్సవాల కోసం సోమవారం సాయంత్రం వైదిక క్రతువులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా వాస్తుహోమం, పంచగవ్య ప్రోక్షణ, బింబశుద్ధి, స్థాపనతో నమూనా ఆలయాన్ని ప్రారంభించారు. స్వామి, అమ్మవార్లకు మైదానంలో వీధి ఉత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారులు భక్తి సంకీర్తనలు ఆలపించారు.

మొదటి రోజు ఉదయం 6 గంటలకు సుప్రభాతం, ఉదయం 6.30 నుంచి 7.30 గంటల వరకు తోమాలసేవ, కొలువు, ఉదయం 7.30 నుంచి 8.15 గంటల వరకు అర్చన, ఉదయం 8.15 నుంచి 8.30 గంటల వరకు నివేదన, శాత్తుమొర, ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకు అష్టదళ పాదపద్మారాధన, ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు రెండో నివేదన చేపడతారు. ఉదయం10 గంటలకు వసంతోత్సవం, ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సాయంత్రం 5.30 నుంచి 6.30 గంటల వరకు సహస్రదీపాలంకార సేవ, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 7.30 గంటల వరకు వీధి ఉత్సవం, రాత్రి 7.30 నుంచి 8.30 గంటల వరకు రాత్రి కైంకర్యాలు, రాత్రి 8.30 నుంచి 9 గంటల వరకు ఏకాంతసేవ నిర్వహిస్తారు.

టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.