STRIVE HARD TO BECOME THE BEST CITIZENS OF FUTURE INDIA-TTD EO TO STUDENTS _ భవిష్యత్ భారత పౌరులుగా ఎదగండి – విద్యార్థులకు టీటీడీ ఈవో పిలుపు
“AZADI KA AMRIT MAHOTSAV” RALLY HELD BY TTD
AV ON 75 FREEDOM FIGHTERS STEALS THE SHOW
TIRUPATI, 15 AUGUST 2022: Following the call given by the Honourable Prime Minister of India Sri Narendra Modi to observe “Azadi ka Amrit Mahotsav” on the glorious completion of 75 years of Independent India, TTD has carried out a massive rally with its employees and students on Monday.
The Rally led by TTD EO Sri AV Dharma Reddy commenced at the TTD Administrative Building and reached the Mahati Auditorium.
At Mahati, a 42 minute Audio-visual comprising the details of 75 freedom fighters was displayed which received humongous response from the audience of employees and students of TTD educational institutions.
Later addressing the students, TTD EO Sri AV Dharma Reddy said the students studying in TTD institutions are unique from others as they have the direct grace of Universal Supremo Sri Venkateswara Swamy to design their career. “It becomes the responsibility of every pupil to make use of this golden opportunity and establish their career with discipline and dedication and to become the responsible citizens of Future India”, he added amidst the cheers from the students.
Later the EO felicitated CAuO Sri Sesha Sailendra and CEO SVBC Sri Shanmukh Kumar for preparing the AV in a couple of days in an attractive manner befitting the “Azadi ka Amrit Mahotsav” celebrations.
JEO (H and E) Smt Sada Bhargavi, JEO Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, FACAO Sri Balaji and DEO Sri Govindarajan were felicitated by the EO for making the fete a grand success.
Earlier, the students displaying the guise of various freedom fighters led the rally along the streets of Tirupati by raising slogans Vande Mataram, Bharat Mata ki Jai with patriotic fervour.
CE Sri Nageswara Rao, GM IT Sri Sesha Reddy, Engineering officials, DyEOs and other Heads of various other departments of TTD, Educational Institutions were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
భవిష్యత్ భారత పౌరులుగా ఎదగండి – విద్యార్థులకు టీటీడీ ఈవో పిలుపు
టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ర్యాలీ
-. ఆకట్టుకున్న 75 మంది స్వాతంత్య్ర సమరయోధుల వీడియో
తిరుపతి, 2022 ఆగస్టు 15: స్వాతంత్య్ర భారతావని 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను నిర్వహించాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు టీటీడీ ఈవో శ్రీ ఎ వి ధర్మారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉద్యోగులు , విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు . టీటీడీ పరిపాలన భవనం నుండి మహతి ఆడిటోరియం వరకు ర్యాలీ సాగింది.
మహతి కళాక్షేత్రంలో 75 మంది స్వాతంత్య్ర సమరయోధుల జీవిత చరిత్రలతో కూడిన 42 నిమిషాల ఆడియో-వీడియో ప్రదర్శించారు. దీనికి టీటీడీ విద్యా సంస్థల ఉద్యోగులు మరియు విద్యార్థుల నుండి విశేష స్పందన లభించింది.
అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఈవో మాట్లాడుతూ, శ్రీ వేంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో టీటీడీ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు తమ కెరీర్‌ను ఇతరుల కంటే ఉన్నతంగా రూపొందించుకోవాలన్నారు. ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రమశిక్షణ, అంకితభావంతో బాధ్యతాయుతమైన పౌరులుగా ఎదగడం ప్రతి విద్యార్థి బాధ్యత అన్నారు.
“ఆజాదీ కా అమృత్ మహోత్సవ్” ఉత్సవాలకు తగిన విధంగా రెండు రోజుల్లో ఆకర్షణీయంగా వీడియోను సిద్ధం చేసినందుకు సిఏవో శ్రీ శేష శైలేంద్ర , ఎస్వీబిసి సిఈవో శ్రీ షణ్ముఖ కుమార్‌లను ఈవో సన్మానించారు.
ఈ ఉత్సవాన్ని విజయవంతం చేసినందుకు జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహ కిషోర్, ఎఫ్ఏసిఎవో శ్రీ బాలాజీ, డిఈవో శ్రీ గోవిందరాజన్‌లను ఈవో ఘనంగా సత్కరించారు.
అంతకుముందు విద్యార్థులు వివిధ స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలతో తిరుపతి వీధుల్లో వందేమాతరం, భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తితో ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సీఈ శ్రీ నాగేశ్వరరావు, ఐటీ జీఎం శ్రీ శేషారెడ్డి, ఇంజినీరింగ్ అధికారులు, డెప్యూటీ ఈవోలు, టీటీడీ విద్యాసంస్థలలోని వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.