VENUGOPALA RIDES CHINNA SESHA VAHANAM _ చిన్నశేష వాహనంపై వేణుగోపాల స్వామి అలంకారంలో శ్రీ ప్రనన్న వేంకటేశ్వరుని దర్శనం

Tirupati, 20 Jun. 21: On the second day of the ongoing annual brahmotsavams at Sri Prasanna Venkateswara Swamy temple in Appalayagunta, the processional deity dressed as Venugopala Krishna holding a flute in His hand, took a celestial ride on Chinna Sesha Vahanam on Sunday morning.

Due to Covid restrictions, the Vahana Seva took place in Ekantam.

Temple officials were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

చిన్నశేష వాహనంపై వేణుగోపాల స్వామి అలంకారంలో శ్రీ ప్రనన్న వేంకటేశ్వరుని దర్శనం

తిరుపతి 20 జూన్ 2021: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం ఉద‌యం స్వామివారు పిల్ల‌న‌గ్రోవి ధ‌రించి వేణుగోపాల స్వామివారి అలంకారంలో చిన్నశేష వాహనంపై ద‌ర్శ‌న‌మిచ్చారు.

పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడు వాసుకిగా భావించడం కద్దు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని సందర్శిస్తే భక్తులకు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి.

సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు హంస వాహనంపై స్వామివారు కటాక్షించనున్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి క‌స్తూరి, ఏఈవో శ్రీ ప్ర‌భాక‌ర్ రెడ్డి, ఆల‌య ప్ర‌ధాన అర్చ‌కులు మ‌రియు కంక‌ణ‌బ‌ట్టార్ శ్రీ సూర్య‌కుమార్ ఆచార్యులు, సూప‌రింటెండెంట్ శ్రీ గోపాల కృష్ణ‌రెడ్డి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్ శ్రీ శ్రీ‌నివాసులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది