VIJAYADASA ARADHANA COMMENCES _ తిరుమలలో శ్రీ విజ‌య‌దాస‌రు ఆరాధనా మహోత్సవాలు ప్రారంభం

TIRUMALA, 13 NOVEMBER 2021: The two day Aradhana Mahotsavams of Sri Vijayadasa commenced at Asthana Mandapam in Tirumala on Saturday.

Dasa Sahitya Project Special Officer Sri Anandatheerthacharyulu speaking on the occasion said Vijayadasa penned 25000 keertans.

He said actually he was called Madhyapati, the youngest son of Sri Purandharadasa during his previous birth.

The Kannada Sangeeta Pitamaha has written 4.75lakh Sankeertans as against his aim of five lakhs. He has handed over the responsibility of completing the remaining 25000 Sankeertans to his youngest son Madhyapati

After 250 years, Madhyapati was reborn as Vijayadasa and completed his father’s divine mission, he said.

HDPP Project Officer Sri Vijayasaradhi, HDPP Secretary Sri KS Rama Rao were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

తిరుమలలో శ్రీ విజ‌య‌దాస‌రు ఆరాధనా మహోత్సవాలు ప్రారంభం

తిరుమల, 2021 న‌వంబ‌రు 13: ప్ర‌ముఖ కర్ణాటక సంగీత దాస తత్వవేత్తలలో ఒకరైన శ్రీ విజ‌య‌దాస‌రు ఆరాధనా మహోత్సవాలు టిటిడి దాససాహిత్యప్రాజెక్టు ఆధ్వర్యంలో శ‌నివారం ఉద‌యం తిరుమలలోని ఆస్థాన మండ‌పంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. కోవిడ్ – 19 నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా టిటిడి దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ ఒక జీవితకాలంలో 4.75 లక్షల సంకీర్తనలు రచించడం దైవాంశ సంభూతుడు, సాక్షాత్తు నారద స్వరూపులైన శ్రీ పురందరదాసుకే సాధ్యమైందని తెలిపారు. పురంద‌ర‌దాసుల‌కు 5 లక్ష‌ల సంకీర్త‌న‌లు ర‌చించాల‌నే సంక‌ల్పం ఉండేద‌ని, కానీ వ‌య‌స్సు స‌హ‌క‌రించ‌క త‌న చివ‌రి కుమారుడైన శ్రీ మ‌ధ్యాప‌తిని 25 వేల సంకీర్త‌న‌లు ర‌చించ‌వ‌ల‌సిందిగా సూచించార‌ని చెప్పారు.

ప్రాచీనులు తెలిపిన విధంగా శ్రీ మ‌ధ్యాప‌తి పునఃజ‌న్మిస్తార‌ని అప‌ర జ్ఞానులైన శ్రీ పురంద‌ర దాసుల‌వారు తెలియ‌జేశార‌న్నారు. దాదాపు 250 సంవ‌త్స‌రాల త‌రువాత శ్రీ విజ‌య‌దాస‌రుగా అవ‌త‌రించి పూర్వ‌జ‌న్మ తండ్రి అయిన శ్రీ పురంద‌ర దాసుల అజ్ఞానుసారంగా 25 వేల‌కు పైగా భక్తి గీతాలను స్వరపరిచారిచి శ్రీ‌వారికి స‌మ‌ర్పించార‌న్నారు.

శ్రీ విజయదాసరు ప్ర‌తి సంవ‌త్స‌రం తిరుమ‌ల శ్రీవేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌కు శిష్య‌బృందంతో వ‌చ్చి ఉత్స‌వాల్లో భాగ‌మైన సంకీర్త‌న‌లు, న‌ర్త‌న సేవ‌లు చేసి శ్రీ‌వారిని సంతోషపెట్టేవార‌ని వివ‌రించారు.

ఇందులో భాగంగా ఉద‌యం 8 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు, మ‌ధ్యాహ్నం 2.30 నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు, ఆంధ్ర‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర రాష్ట్రాల‌కు చెందిన 150 మంది దాస సాహిత్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ విజ‌య‌దాసుల సంకీర్త‌న‌లు పారాయ‌ణం చేశారు.

అంత‌కుముందు బెంగూళూరుకు చెందిన ప్ర‌ముఖ క‌ళాకారులు శ్రీ‌మ‌తి ఐశ్వ‌ర్య‌, శ్రీ‌మ‌తి సంధ్య‌, శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ మ‌ధూసూద‌న్ బృందం శ్రీ విజ‌య‌దాస‌రు కీర్త‌న‌ల‌ను సుమ‌ధురంగా అల‌పించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ఆల్ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ప్ర‌త్యేకాధికారి శ్రీ విజ‌య‌సార‌ధి, హిందూ ధ‌ర్మ‌ప్ర‌చార ప‌రిష‌త్ కార్య‌ద‌ర్శి శ్రీ రామారావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.