PREPARE ACTION PLAN TO PROVIDE COWS AND OXEN TO GO ADHARITA FARMERS -TTD EO _ గో ఆధారిత రైతులకు ఆవులు, ఎద్దులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయండి – అధికారులకు టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశం

PERFORMS GOPUJA IN SV GOSALA

INSPECTS PADMAVATHI PAEDIATRIC CARDIAC CENTRE

TIRUPATI, 13 NOVEMBER 2021: Prepare an action plan to provide cows and oxen to the farmers who are encouraging Goadharita Vyavasayam, said TTD EO Dr KS Jawahar Reddy.

The EO performed Gopuja in SV Gosala at Tirupati on Saturday. Speaking on the occasion, the EO directed the officials to prepare an action plan to provide the same to the farmers. He said so far about 330 Cows and Oxen have been given to the farmers free of cost. He asked the officials concerned to prepare a manual on how to protect these cows and oxen, about their fodder etc.and give it to the farmers.

JEO Sri Veerabrahmam, Gosala Director Dr Harnath Reddy, Veterinary University Extension Director Dr Venkata Naidu and others were also present.

EO VISITS HOSPITAL

Earlier, the EO also paved a visit to Sri Padmavathi Paediatric Cardiac Hospital in Tirupati and interacted with the patients.

CE Sri Nageswara Rao, Director Dr Srinath Reddy were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

గో ఆధారిత రైతులకు ఆవులు, ఎద్దులు ఇవ్వడానికి ఏర్పాట్లు చేయండి
– అధికారులకు టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశం
– గోశాలలో గోపూజలో పాల్గొన్న ఈవో
– చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రి సందర్శన

తిరుమల 13 నవంబరు 2021: గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులకు రాష్ట్ర రైతు సాధికారిక సంస్థ ద్వారా గోవులు, ఎద్దులు ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

శనివారం గో శాలలో ఆయన గో పూజ చేశారు. గోవు, దూడకు పసుపు, కుంకుమ, పూలమాలలు, నూతన వస్త్రాలు సమర్పించి శాస్త్రోక్తంగా పూజ చేశారు. అనంతరం గోవు, దూడకు దాణా,గ్రాసం అందించారు.
అనంతరం ఈవో అధికారులతో మాట్లాడుతూ, తిరుపతి, పలమనేరు గోశాలల నుంచి సుమారు 330 గోవులు, ఎద్దులు రైతులకు ఉచితంగా అందించినట్లు చెప్పారు. రైతులు ఉచితంగా అందుకున్న గోవులు, ఎద్దుల పోషణకు సంబంధించి మార్గదర్శకాలు తయారుచేసి రైతులకు వివరించాలని చెప్పారు.

జెఈవో శ్రీ వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, గోశాల డైరెక్టర్ డాక్టర్ హరినాథ రెడ్డి, పశువైద్య విశ్వవిద్యాలయం విస్తరణ డైరెక్టర్ డాక్టర్ జి.వెంకటనాయుడు ఇతర అధికారులు పాల్గొన్నారు.

అంతకుముందు ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సల ఆసుపత్రిని సందర్శించారు. ఐసియు లో చికిత్స పొందుతున్న బాలిక కవిత తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి ఇంకా రావాల్సిన సూక్ష్మ యంత్ర పరికరాలు త్వరగా సమకూర్చుకోవడానికి వెంటనే టెండర్లు పిలవాలని
అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో జెఈవో శ్రీ వీరబ్రహ్మం, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ రెడ్డి పాల్గొన్నారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది