VIJAYADASA ARADHANA CONCLUDES _ ఘనంగా ముగిసిన శ్రీ విజ‌య‌దాస‌రు ఆరాధనోత్సవాలు

Tirumala, 14 Nov. 21: The two-day Vijayadasa concluded at Asthana Mandapam in Tirumala on Sunday under the aegis of the Dasa Sahitya Project of TTD.
 

The Goshthi Ganam was held by Dasa Artists followed by a lecture on Vijayadasa life by the Project Special Officer Sri PR Anandatheerthacharyulu.

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ఘనంగా ముగిసిన శ్రీ విజ‌య‌దాస‌రు ఆరాధనోత్సవాలు

తిరుమల, 2021 న‌వంబ‌రు 13: తిరుమలలో గత రెండు రోజులుగా టిటిడి దాససాహిత్య ప్రాజెక్ట్‌ ఆధ్వర్యంలో జరుగుతున్న కన్నడ సంగీత పితామహుడు శ్రీ విజ‌య‌దాస‌రు ఆరాధన మహోత్సవాలు ఆదివారంనాడు ఆస్థాన మండ‌పంలో ఘనంగా ముగిశాయి.

దాససాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు మాట్లాడుతూ భగవంతుని నామసంకీర్తన కలియుగంలో అత్యంత ఉన్నతమైన భక్తి మార్గమని చెప్పారు. మాన‌వ జీవ‌న విధానంలో ఎదుర‌య్యే స‌మ‌స్య‌ల‌కు పూర్వ‌జ‌న్మ క‌ర్మ ఫ‌ల‌మే కార‌ణ‌మ‌న్నారు. దీని నుండి బ‌య‌ట ప‌డ‌టానికి మ‌హాత్ముల‌ను సంద‌ర్శించి వారి మార్గ‌ద‌ర్శ‌కంలో భ‌గ‌వంతుడిని సేవించ‌డం ద్వారా మోక్షం పొంద‌వ‌చ్చ‌ని వివ‌రించారు.

అంత‌కుముందు ఉద‌యం 8 నుండి 11.30 గంట‌ల వ‌ర‌కు దాస సాహిత్య ప్రాజెక్టు క‌ళాకారులు శ్రీ విజ‌య‌దాస‌రు సంకీర్తనలను గోష్ఠిగానం ఆలపించారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.