TTD TO OBSERVE KARTHIKA DEEPOTSAVAMS _ నవంబర్ 19న తిరుపతిలో కార్తీక దీపోత్సవం

TIRUPATI, 14 NOVEMBER 2021: In the auspicious month of Karthika, TTD is set to observe Karthika Deepotsavams as in last year.

On November 19, Karthika Deepotsavam will be performed in the Parade Grounds of the TTD Administrative Building between 6pm and 8pm.

While contemplating to observe the festival of lights at the Palace Grounds in Bengaluru on November 22 and on November 29 in the MGM Grounds of Beach Road at Visakhapatnam.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

 

నవంబర్ 19న తిరుపతిలో కార్తీక దీపోత్సవం

తిరుపతి, 2021 న‌వంబ‌రు 14: పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని టిటిడి ఆధ్వర్యంలో నవంబర్ 19వ తేదీన తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం మైదానంలో కార్తీక దీపోత్సవం జరగనుంది. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరగనున్న ఈ కార్యక్రమాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

అదేవిధంగా నవంబరు 22వ తేదీన బెంగళూరు నగరంలోని ప్యాలెస్ మైదానంలో, నవంబర్ 29వ తేదీన విశాఖపట్నంలోని బీచ్ రోడ్డులో గల ఎంజీఎం మైదానంలో కార్తీక దీపోత్సవాలు నిర్వహించేందుకు టిటిడి ఏర్పాట్లు చేపడుతోంది.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.