VINAYAKA CHAVITI OBSERVED WITH RELIGIOUS FERVOUR _ వినాయకుడు అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగించాలి : జెఈఓ శ్రీ వీరబ్రహ్మం

TIRUMALA, 31 AUGUST 2022: The Vinayaka Chaviti festivities were observed with religious fervour in the Vinayaka temples located on both the Ghat Roads.

In the first Ghat Road (Down Ghat), TTD JEO Sri Veerabrahmam participated in the special and wished everyone Vinayaka Chaviti. He said with the blessings of Ghat Road Vinayaka the destination travel is safe for everyone.

GM Transport Sri Sesha Reddy, SE 2 Sri Jagadeeshwar Reddy, DyEO Sri Devendrababu, VGO Sri Manohar, DI Tirumala Sri Janakirami Reddy and others were also present.

TTD has organised Annamacharya Sankeertans and Harikatha on this occasion.

In the Second Ghat Road(Up Ghat) Vinayaka temple, devotees thronged in large numbers and offered prayers.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

వినాయకుడు అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగించాలి : జెఈఓ శ్రీ వీరబ్రహ్మం

మొదటి ఘాట్‌ రోడ్డులో వినాయక చవితిపూజ

తిరుమల, 2022 ఆగస్టు 31: వినాయకుడు అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగించి మంచి జరిగేలా చూడాలని టిటిడి జెఈవో శ్రీ వీరబ్రహ్మం ఆకాంక్షించారు. వినాయక చవితి సందర్భంగా బుధ‌వారం టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో తిరుమల మొదటి ఘాట్‌ రోడ్డులోని శ్రీవినాయకస్వామివారికి వినాయక చవితి పూజ ఘనంగా నిర్వహించారు.

ఈ పూజలో పాల్గొన్న జెఈఓ మాట్లాడుతూ ఇక్కడి స్వామివారి ఆశీస్సులతో భక్తులు, ఉద్యోగులు, స్థానికులు సురక్షితంగా కనుమ రోడ్డులో ప్రయాణిస్తున్నారని చెప్పారు. రెండు ఘాట్ రోడ్ల‌లో శ్రీ‌వారి భ‌క్తులు సుర‌క్షిత ప్ర‌యాణానికి ప్ర‌తి సంవ‌త్స‌రం టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో వినాయకస్వామివారికి పూజ‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. 

ఆ తరువాత అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంగీత కార్యక్రమం నిర్వహించారు.

టిటిడి రవాణా విభాగం జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, విజివో శ్రీ మనోహర్, డెప్యూటీ ఈఓ శ్రీ దేవేంద్ర బాబు, డిఐలు శ్రీ జానకిరామిరెడ్డి, శ్రీ మోహన్, శ్రీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

రెండో ఘాట్ రోడ్డులోని ఆల‌యంలో…

రెండో ఘాట్‌ రోడ్డులోని శ్రీ వినాయకస్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా బుధవారం ఉద‌యం మూలవర్లకు అభిషేకం నిర్వ‌హించారు. విశేష అలంకరణలో ఉన్న స్వామి వారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.