VINAYAKA CHAVITI OBSERVED WITH RELIGIOUS FERVOUR_ మొదటి కనుమ రోడ్డులోని శ్రీవినాయక ఆలయంలో ఘనంగా చవితి పూజ

Tirumala, 13 September 2018: The auspicious festival of Vinayaka Chaviti was observed with religious fervour by TTD in both the temple of Lord Ganesha located at First Ghat Road as well Second Ghat Road in Tirumala.

JEOs Sri KS Sreenivasa Raju and Sri P Bhaskar offered prayers in the First Ghat Road Vinayaka Swamy temple On the way to Tirumala Hills from Alipiri, special decorations were made to the Vinayaka Swamy temple and special pujas were offered to the deity. They said, this Vinayaka Swamy will ensure safety of pilgrims, drivers and bless a blissful travel on ghat roads.

GM Transport Sri Sesha Reddy also took part in this function.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మొదటి కనుమ రోడ్డులోని శ్రీవినాయక ఆలయంలో ఘనంగా చవితి పూజ

సెప్టెంబరు 13, తిరుపతి 2018: తిరుమల మొదటి కనుమ రోడ్డులో గల శ్రీ వినాయకస్వామివారి ఆలయంలో టిటిడి రవాణా విభాగం ఆధ్వర్యంలో గురువారం చవితి పూజ ఘనంగా జరిగింది. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని చలువపందిళ్లు వేసి ఆలయాన్ని అందంగా అలంకరించారు. అర్చకులు శాస్త్రోక్తంగా గణపతికి పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు మాట్లాడుతూ శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులందరూ తిరుగుప్రయాణంలో ఇక్కడి వినాయకస్వామివారిని దర్శించుకుంటారని తెలిపారు. అధికారులు విధి నిర్వహణలో భాగంగా నిత్యం తిరుమల, తిరుపతి మధ్య కనుమ రోడ్డులో ప్రయాణిస్తుంటారని, రవాణా విభాగంలోని డ్రైవర్లు అప్రమత్తంగా వాహనాలు నడిపి వారికి సహకరిస్తున్నారని వివరించారు.

తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌ మాట్లాడుతూ ఇక్కడి స్వామివారి ఆశీస్సులతో భక్తులు సురక్షితంగా కనుమ రోడ్డులో ప్రయాణిస్తున్నారని చెప్పారు. భక్తులకు మరింత మెరుగైన సేవలందించేందుకు శ్రీవారి ఆశీస్సులతోపాటు వినాయకుని ఆశీస్సులు కోరుకున్నట్టు తెలిపారు. వినాయకుడు అందరి జీవితాల్లో విఘ్నాలు తొలగించి మంచి జరిగేలా చూడాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి రవాణా విభాగం జనరల్‌ మేనేజర్‌ శ్రీ శేషారెడ్డి, విఎస్‌వో శ్రీఅశోక్‌కుమార్‌ గౌడ్‌ ఇతర అధికారులు, డ్రైవర్లు పాల్గొన్నారు.

శ్రీ కపిలేశ్వరాలయంలో…

టిటిడికి అనుబంధంగా ఉన్న తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరాలయంలో గురువారం వినాయక చవితి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి మూలవర్లకు అభిషేకం, అర్చన చేపట్టారు. సాయంత్రం శ్రీవినాయకస్వామివారు మూషికవాహనంపై ఊరేగి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

అదేవిధంగా, రెండో ఘాట్‌ రోడ్డులోని శ్రీవినాయకస్వామివారి ఆలయంలో వినాయక చవితి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.