DHWAJAROHANAM MARKS THE GRAND BEGINNING OF BTUs_ ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Tirumala, 13 September 2018: The temple flag hoisting festival, Dhwajarohanam was performed with religious fervour in the hill shrine of Lord Venkateswara in Tirumala marking the grand beginning of nine day annual brahmotsavams.

A specially designed flag with the image of Garudalwar was hoisted on the temple pillar located in Dhwaja mandapam in auspicious Kuburan between 4pm and 4.45pm during Makara Lagnam.

The priests chanted relevant mantras when the religious ceremony is underway. The significance of this fete is that it acts as an invitation to the deities of all worlds to take part in the mammoth event of annual brahmotsavams of the Supreme Lord Venkateswara.

TTD Chairman Sri Putta Sudhakar Yadav, EO Sri Anil Kumar Singhal, TTD Trust Board Members Sri Challa Ramachandra Reddy, Sri Potluri Ramesh Babu,
JEOs Sri KS Sreenivasa Raju, Sri Pola Bhaskar, Addl CVSO Sri Sivakumar Reddy, VGO Sri Raveendra Reddy, Temple DyEO Sri Haridranath, Peishkars Sri Ramesh, Sri Nagaraj and others took part.


ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

ధ్వజారోహణంతో వైభవంగా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

సెప్టెంబరు 13, తిరుమల 2018: శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం సాయంత్రం 4 నుండి 4.45 గంటల మధ్య మకర లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో వైభవంగా ప్రారంభమయ్యాయి.

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేదగానాల మధ్య మంగళవాద్యాలు మోగుతుండగా అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడధ్వజాన్ని ఎగురవేశారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారని ప్రాశస్త్యం.

ముందుగా బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, ఈవో శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌, బోర్డు సభ్యులు శ్రీ చల్లా రామచంద్రారెడ్డి, శ్రీపొట్లూరి రమేష్‌బాబు, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పోల భాస్కర్‌, ఇన్‌చార్జి సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి, విఎస్‌వో శ్రీ రవీంద్రారెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీహరీంద్రనాథ్‌, పేష్కార్లు శ్రీ రమేష్‌బాబు, శ్రీ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.