VISHNU SAHASRA NAMA PARAYANAM IS THE WAY FOR MOKSHA-KANCHI PONTIFF _ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయ‌ణం ముక్తికి మార్గం – శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామిజీ

AKHANDA VISHNU SAHASRA NAMA STOTRA PARAYANAM HELD ON BHEESHMA EKADASI

TIRUMALA, 12 FEBRUARY 2022: Akhanda Vishnu Sahasra Nama stotra parayanam was held at Nada Neerajana mandapam with religious fervour in Tirumala on Saturday on the auspicious occasion of Bheeshma Ekadasi.

The Pontiff of Kanchi, Sri Vijayendra Saraswathi Swamy, who graced the event, in his Anugraha Bhashanam said, the best way to attain salvation in Kaliyuga is by the way of chanting the divine names in Vishnu Sahasra Nama Parayanam. “Bheeshma has taught Vishnu Sahasra Namam to Dharamaraja which was approved by Sri Maha Vishnu Himself. Today, the Vishnu Sahasra Namam was recited thrice and the fruits of this great mantra will be definitely bestowed on devotees who chanted with utmost devotion”, he maintained.

Earlier, Vedic Scholars Sri Seshacharyulu, Sri Narasimham and Sri Brahmacharyulu led the chorus chanting of the divine namas. The entire Tirumala echoed with the divine vibes that emerged out of these divine chants. Along with Vishnu Sahasra Nama, Sri Lakshmi Astottara Stotram, Purva and Uttara Peethikas were also recited.

On the stage, Srivaru along with Sridevi and Bhudevi were seated on Pedda Sesha Vahanam and a replica of Bheeshmacharya was also placed.

Additional EO Sri AV Dharma Reddy, Agama Advisor Sri Mohanarangacharyulu, SV Higher Vedic Studies Project Officer Dr A Vibhishana Sharma, Vedic scholars, pundits from SV Vedic University, National Sanskrit Varsity and Dharmagiri Veda Vignana Peetham were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయ‌ణం ముక్తికి మార్గం – శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామిజీ

భ‌క్తిభావాన్ని పంచిన శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర అఖండ‌ పారాయణం

తిరుమ‌ల‌, 2022 ఫిబ్ర‌వ‌రి 12: భీష్మ ఏకాదశి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని లోక‌క‌ల్యాణం కోసం తిరుమల నాదనీరాజనం వేదికపై శ‌నివారం ఉద‌యం టిటిడి చేప‌ట్టిన శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర అఖండ‌ పారాయణం భ‌క్తిభావాన్ని పంచింది. ప‌లువురు భ‌క్తులు నేరుగా పాల్గొన‌గా, శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ల‌క్ష‌లాది మంది భ‌క్తులు త‌మ ఇళ్లలోనే పారాయ‌ణం చేశారు. వేదిక మీద‌ పెద్ద శేష వాహ‌నంపై శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారిని, ప‌క్క‌న‌ శ్రీ భీష్మాచార్యుల ప్ర‌తిమ‌ను కొలువు దీర్చి మంగ‌ళ‌హార‌తి స‌మ‌ర్పించారు. ఈ పారాయ‌ణ కార్య‌క్ర‌మంలో కంచి కామకోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామిజీ పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా కంచి కామకోటి పీఠాధిప‌తి శ్రీ‌శ్రీ‌శ్రీ విజ‌యేంద్ర స‌ర‌స్వ‌తి స్వామిజీ అనుగ్ర‌హ భాష‌ణం చేస్తూ శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రాన్ని మొద‌టి, రెండు, మూడ‌వ ప‌ర్యాయాలు ప‌ఠించ‌డం వ‌ల‌న విశేష ఫ‌లితాలు ల‌భిస్తాయ‌ని వేదాల్లో చెప్పిన‌ట్లు తెలిపారు. మ‌న జీవ‌తంలో ధ‌ర్మాన్ని తెలుసుకునేందుకు అవకాశం, శ‌క్తి స‌రిపోద‌ని, దీనిని సుల‌భంగా తెలుసుకునేందుకు శ్రీ విష్ణుసహస్రనామాన్ని శ్రీ భీష్మాచార్యులు శ్రీ ధ‌ర్మ‌రాజుకు వివ‌రించ‌గా శ్రీ మ‌హావిష్ణువు ఆమోదించార‌న్నారు. కావున ఎవ‌రైతే విష్ణుసహస్రనామాన్ని పారాయ‌ణం చేస్తారో వాళ్ళు భ‌గ‌వంతుడి స‌న్నిధికి చేరుతార‌ని వివ‌రించారు.

ముందుగా వేద సంస్కృత పండితులు శ్రీ శేషాచార్యులు. శ్రీ కుప్పా న‌ర‌సింహం, డా. టి. బ్రహ్మచార్యులు శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్ర వైశిష్ట్యాన్ని తెలియ‌జేసి, సంకల్పం చెప్పారు. ఆ త‌రువాత శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రమ్ 30 శ్లోకాలు, పూర్వపీఠిక 29 శ్లోకాలు పారాయ‌ణం చేశారు. అనంత‌రం విష్ణు సహస్రనామ స్తోత్రం 108 శ్లోకాలను మూడు సార్లు, ఉత్తరపీఠికలోని 34 శ్లోకాలను పారాయణం చేశారు. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌కు చెందిన శ్రీ నాగరాజన్ బృందం చేసిన నారాయణ నామ సంకీర్తనం భ‌క్తుల‌ను భ‌క్తిసాగ‌రంలో ముంచెత్తింది.

తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థలోని సుమారు 200 మంది వేదపండితులు, విశేష సంఖ్య‌లో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

లోక‌క‌ల్యాణం కోసం 2020 ఏప్రిల్ నుండి టిటిడి ప‌లు కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తోంది. ఇందులో యోగవాసిష్ఠం, ధన్వంతరి మహామంత్ర పారాయణం, సుందరకాండ పఠనం, వేదపారాయణం, విరాటపర్వం, శ్రీమద్భగవద్గీత, షోడశదిన సుందరకాండ పారాయణ దీక్ష, కార్తీక మాసోత్సవం, ధనుర్మాసోత్సవం, మాఘ మాసోత్సవం, బాల కాండ పారాయ‌ణం త‌దిత‌ర విశేష కార్యక్రమాలను రూపొందించి శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసింది. త‌ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తులకు స్వామివారి ఆశీస్సులు అందించింది.

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి. ధర్మారెడ్డి, వైఖాన‌స ఆగ‌మ స‌ల‌హాదారు శ్రీ మోహ‌న రంగ‌చార్యులు, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్ర‌త్యేకాధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ తదితరులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.