VISWANATHA IS THE “EMPEROR OF TELUGU POETRY”-GOVERNOR _ విశ్వనాథ సత్యనారాయణ తెలుగు సాహిత్యానికే నాదం : గవర్నర్ శ్రీ ఇఎస్‌ఎల్.నరసింహన్
TIRUPATI, JAN 2: Describing renowned poet and Jnanpeeth Awardee late Sri Vishwanatha Satyanarayana as the “Emperor of Telugu Poetry”(Kavi Samrat), H.E. the Governor of Andhra Pradesh Sri ESL Narasimhan hailed the contributions of the legendary poet to Telugu literature.
The Honourable Governor of the State who took part as Chief Guest in the four-day national seminar on Vishwanatha Sahitya organised by Annamacharya Project of TTD in Tirupati Mahati Auditorium on Wednesday he said, Kavi Samrat Viswanatha was the Pride of Telugus. “He has given utmost reverence to the traditional values of Telugu literature, language and the culture of the country. He stood as one of the most popular literary icons in the field of literature in 20th century in the entire country. He has penned around one lakh pages in his life time which includes great works like “Ramayana Kalpavriksham”, “Veyi Padagalu” etc. He was a personification of Bhakti, Karma and Gnana Yoga which could be rarely seen in any person”, he added.
Later in his speech TTD Chairman Sri K Bapiraju said, the acceptance of Governor to participate in this great literary conference shows his love towards Telugu. “The students should make use of this programme and should learn the literary values embedded in the great works of Vishwanatha Satyanarayana.
Addressing the conference, TTD EO Sri LV Subramanyam said, the literary works by Kavi Samrat Vishwanatha Satyanarayana not only brought global acclaim to Telugu but taught the world the cultural values that were being practiced in the country in a systematic manner. He called upon the students read the books of Kavi Samrat so that they will not only learn the language but also will get the energy and courage which they come across in their lives.
In his presidential address, TTD JEO Tirupati Sri P Venkatrami Reddy said, Vishwanatha completed Veyi Padagalu (Sahasra Phan in Hindi) in just 23 days. The book itself is an identity of the legendary poet, he added.
Annamacharya Project Director Dr Medasani Mohan, CVSO Sri GVG Ashok Kumar and others were also present.
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
తిరుపతి, జనవరి 02, 2013: తెలుగు సాహిత్యంలో తొలిసారి జ్ఞాన్‌పీఠ్ పురస్కారం పొందిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ తన రచనలతో మొత్తం తెలుగు సాహిత్యానికే నాదంగా నిలిచారని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌ|| శ్రీ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ కొనియాడారు. తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు, పురాణ ఇతిహాస ప్రాజెక్టు, విశ్వనాథ సాహితీ పీఠం సంయుక్త ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో బుధవారం ”భారతీయ సాంస్కృతిక పరిరక్షణ – విశ్వనాథ సాహిత్యం” అనే అంశంపై నాలుగు రోజుల జాతీయ సదస్సు ప్రారంభమైంది.
సభాధ్యక్షులుగా వ్యవహరించిన తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి ప్రసంగిస్తూ విశ్వనాథవారి సాహిత్యాన్ని ప్రత్యేకంగా విద్యార్థులకు పరిచయం చేసేందుకే ఈ సదస్సు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. విశ్వనాథ వారి వాక్కు, వాక్యం, దర్శనం, భావం, విమర్శనంలో నిండైన వ్యక్తిత్వం కనిపిస్తుందన్నారు. విశ్వనాథవారు వేయిపడగలు నవల రచనను 23 రోజుల్లో పూర్తి చేశారని, సామాన్యులు దాన్ని చదివి అర్థం చేసుకోవాలంటే నెల రోజులు పడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, ఎడిటర్-ఇన్-చీఫ్ ఆచార్య రవ్వా శ్రీహరి ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.