TTD SUPDT ENGINEER SRI SUDHAKAR RAO WON NATIONAL LEVEL BADMINTON CHAMPIONSHIP _ తితిదే ఎస్‌ఈ-1 శ్రీ సుధాకరరావుకు ఈవో అభినందన

Tirupati, 03 Jan 2013: TTD Supdt Engineer Sri S.Sudhakar Rao and Sri N.Ramesh, Retd DD of Agriculture Dept, Tirupati took part in the state level badminton Competitions in the 55year old category organized by A.P Senior veterans men badminton tournament held at Khammam recently and the duo won the championship. TTD EO Sri LV Subramanyam and JEOs Sri K.S.Sreenivasa Raju, Sri P.Venkatarami Reddy complimented them and wished them best of Luck for the National Championship which are scheduled to take place at Mumbai from 19 Feb to 23 Feb.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER, TTDs, TIRUPATI



తితిదే ఎస్‌ఈ-1 శ్రీ సుధాకరరావుకు ఈవో అభినందన

తిరుపతి, జనవరి 03, 2013: రాష్ట్ర సీనియర్‌ పురుషుల(వెటరన్‌) బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌-2012ను కైవసం చేసుకున్న తితిదే సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌-1 శ్రీ సుధాకరరావును తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం అభినందించారు.
 
ఇటీవల ఖమ్మంలో జరిగిన 55 ఏళ్ల విభాగం డబుల్స్‌ కేటగిరీలో శ్రీ సుధాకరరావు, రిటైర్డ్‌ వ్యవసాయ శాఖ డెప్యూటీ డైరెక్టర్‌ శ్రీ ఎన్‌.రమేష్‌తో కలసి ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. అంతేగాక ఫిబ్రవరి 19 నుండి 23వ తేదీ వరకు ముంబయిలో జరుగనున్న జాతీయ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికయ్యారు.
 
ఈవోతోపాటు తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ వీరిని అభినందించారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.