VONTIMITTA BRAHMOTSAVAM ARRANGEMENTS REVIEWED BY TTD JEO _ మార్చి 31 నాటికి కల్యాణ వేదిక సహా బ్రహ్మోత్సవాల పనులన్నీ పూర్తి చేయాలి-టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం

COMPLETE ALL WORKS BY MARCH 31-REHEARSAL ON APRIL 1

 

TIRUPATI, 24 MARCH 2023: In the wake of the annual brahmotsavams and State Festival of Sri Sita Rama Kalyanam at Vontimitta Kodandaramalayam from March 31 to April 8, TTD JEO Sri Veerabrahmam along with Kadapa Joint Collector Sri Saikant Verma held a review meeting with all the department heads on Friday.

 

During the review held at the Meeting Hall at Vontimitta, the JEO directed officials concerned to prepare an action plan on various preparatory activities to be executed for the mega religious festival in YSR Kadapa district.  He instructed the officials to complete the pending works before March 31 and there will be rehearsal on April 1. He also reviewed the arrangements of the deputation of officials and employees, deployment of Srivari Sevaks, Help Desks, accommodation, preparation of Talambralu, Annaprasadams, sanitation, transportation, engineering works, floral decorations, Bhajana teams, security measures etc. He also directed the vigilance officials to coordinate with the local police and make necessary parking and security arrangements for the visiting devotees especially at Kalyana Vedika on the day of celestial marriage on April 5. 

 

The Joint Collector of YSR Kadapa district Sri Saikant Verma directed the officials of the district administration to set up an Inter-Departmental Control Room besides Police Control Room to follow up on the issues related to the respective department and ensure smooth management of the event without any hitch. He also directed the officials concerned from District Administration to complete the works by month end and a rehearsal of the arrangements will be carried out by the top brass authorities from District and TTD on April 1.

 

Additional SP Sri Tushar Dudi, RDO Sri Dharmachandra Reddy, SE Roads and Buildings Sri Maheshwar Reddy, DMHO Dr Nagaraju and other district officials were also present.

 

Among TTD officials, CEO SVBC Sri Shanmukh Kumar, CE Sri Nageswara Rao, CAuO Sri Sesha Sailendra, Deputy EOs Sri Natesh Babu, Sri Gunabhushan Reddy, Sri Subramanyam, VGO Sri Manohar, SVETA Director Smt Prasanti, Annaprasadam Catering Special Officer Sri Shastry, Senior Medical Officer Dr Narmada, Additional HO Dr Sunil, DFO Sri Srinivas, Garden Deputy Director Sri Srinivasulu, Special Officer Printing Press Sri Ramaraju and other officials were present. 

 
ISSUED BY TTD PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 31 నాటికి కల్యాణ వేదిక సహా బ్రహ్మోత్సవాల పనులన్నీ పూర్తి చేయాలి

– ఏప్రిల్ 1 నుండి కల్యాణ వేదిక ఆవరణంలో రిహార్సల్స్

టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం

తిరుపతి 24 మార్చి 20 23: వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేయాలని టీటీడీ జేఈవో
శ్రీ వీర బ్రహ్మం అధికారులను ఆదేశించారు. కల్యాణ వేదిక ప్రాంగణంలో ఏప్రిల్ 1వ తేదీ నుండి రిహార్సల్స్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. మార్చి 31నుండి ఏప్రిల్ 8వ తేదీ వరకు రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై శుక్రవారం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ సాయి కాంత్ వర్మతో కలిసి జేఈవో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ, బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పనులు ఆయా ఇన్చార్జులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే తయారు చేసుకున్న యాక్షన్ ప్లాన్ ను పక్కాగా అమలు చేయాలని ఆయన సూచించారు. డెప్యుటేషన్ సిబ్బంది, శ్రీవారి సేవకులు, హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు, వసతి, తలంబ్రాల తయారీ, అన్నప్రసాదాలపంపిణీ, పారిశుద్ధ్యం, రవాణా ఇంజనీరింగ్ పనుల ప్రగతిపై ఆయన సమీక్షించారు. ఏప్రిల్ 5వ తేదీన జరిగే శ్రీ కోదండరామ స్వామివారి కల్యాణోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరవుతారని ఆయన చెప్పారు. టీటీడీ విజిలెన్స్ అధికారులు స్థానిక పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని, విఐపిలు, భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పార్కింగ్ ఏర్పాట్లు చేయాలన్నారు.గ్యాలరీల్లో ఉండే భక్తులకు అన్న ప్రసాదం, తాగునీరు, స్వామివారి తలంబ్రాలు, పసుపు, కుంకుమ ఉండే బ్యాగులు ఒక పద్ధతి ప్రకారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రత్యేకించి కల్యాణ వేదిక వద్ద విద్యుత్, పుష్పాలంకరణలు, ఎల్ఈడీలు, బ్యారికేడ్లు, గ్యాలరీల నిర్మాణం, విఐపిలు, భక్తుల ప్రవేశ, నిష్క్రమణ మార్గాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా అధికార యంత్రాంగంతో సమన్వయంతో పని చేయాలన్నారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీ సాయి కాంత్ వర్మ మాట్లాడుతూ, వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలన్నారు. దీనివల్ల చిన్నపాటి సమస్యలను అప్పటికప్పుడు పరిష్కరించుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. జిల్లా అధికారులు తమ బృందంలోని టీటీడీ అధికారులతో నిత్యం సమన్వయంతో ఉంటూ వారికి అప్పగించిన పనులు పూర్తి చేయాలన్నారు. రాష్ట్ర పండుగగా జరుపుతున్న శ్రీ కోదండరామ స్వామి కల్యాణాన్ని విజయవంతం చేయడానికి కృషి చేయాలని చెప్పారు. బ్రహ్మోత్సవాలు,స్వామివారి కల్యాణం ఏర్పాట్లపై రోజు వారి ప్రగతి తమకు తెలియజేయాలని ఆదేశించారు.

ఎస్వీబీసి సిఈవో శ్రీ షణ్ముఖ కుమార్, చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేషశైలేంద్ర, టీటీడీ సిఈ శ్రీ నాగేశ్వరరావు, జిల్లా అదనపు ఎస్ పి శ్రీ తుషార్, ఆర్డీవోశ్రీ ధర్మ చంద్రారెడ్డి, ఆర్ అండ్ బి ఎస్ఈ శ్రీ మహేశ్వర రెడ్డి, డిఎం హెచ్ వో డాక్టర్ నాగరాజు తో పాటు టీటీడీ లోని వివిధ విభాగాధిపతులు సమీక్షలో పాల్గొన్నారు.

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లపై పరిశీలన అనంతరం జేఈవో , జాయింట్ కలెక్టర్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్మోహన్ రెడ్డి ఏప్రిల్ 5వ తేదీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై పరిశీలించారు. వాహనాల కాన్వాయ్ ఎంతవరకు రావాలి అనే అంశాలపై పరిశీలన చేశారు. కల్యాణ వేదికపై సిఎం, విఐ పిల సీటింగ్ తదితర ఏర్పాట్ల గురించి క్షేత్ర స్థాయి పరిశీల జరిపారు.

టీటీడీ ప్రజా సంబంధాల అధికారి చే జారీ చేయడమైనది