WHISTLE WIZARD SIVA PRASAD MESMERIZES WITH HIS UNIQUE ART _ విజిల్ సంగీతంతో మైమ‌ర‌పించిన శ్రీ కె.శివ‌ప్ర‌సాద్‌  

Tirumala, 31 January 2020: The performance by world-renowned whistle artists, Sri K Siva Prasad enthralled the Srivari Sevakulu in a big way on Friday. 

As a part of the orientation programme to Srivari Sevakulu in view of Radhasapthami on Friday, at Asthana Mandapam a programme by the whistle wizard has been organised. Sri Siva Prasad has presented some noteworthy songs of Annamacharya which included Kondalalo nelakonna…, Tandanana Aahi…, Pidikita Talambrala…, Narayanate Namo, Vedukundama… and bhajans Sarvatra Govinda Nama Sankeertana…, Govinda Krishna Jai…to rhythmic accompaniment of Sri Bharadwaj on Keyboard, Sri Manjunath on Tabla, OSD Sri Phanirangasai on Mridangam.

Both the TTD EO Sri Anil Kumar Singhal and Additional EO Sri AV Dharma Reddy complimented and thanked the maestro of whistle music which is a unique art who mused the huge gathering with his matchless skills. EO and Additional EO later felicitated the versatile artist who charmed with his talent for over an hour.

Sri Siva Prasad who is now 65 years old, is a disciple of Carnatic music legend late Dr M Balamuralikrishna. He has given over 11,000 concerts world wide and was felicitated with many titles including Human Flute, Swasa Nada Brahma and many more.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI  

విజిల్ సంగీతంతో మైమ‌ర‌పించిన శ్రీ కె.శివ‌ప్ర‌సాద్‌  

 తిరుమల, 2020 జనవరి 31: ప్రపంచ ప్రఖ్యాత విజిల్ సంగీత కళాకారులు  శ్రీ కె.శివ‌ప్ర‌సాద్ శుక్ర‌వారం ఉద‌యం ఎంతో ప్ర‌త్యేక‌మైన విజిల్ ధ్వ‌ని ప్ర‌క్రియ‌తో ఆల‌పించిన శ్రీ‌వారి కీర్త‌న‌లు విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ర‌థ‌స‌ప్త‌మి సంద‌ర్భంగా శుక్ర‌వారం ఉద‌యం తిరుమ‌ల‌లోని ఆస్థాన మండ‌పంలో శ్రీ‌వారి సేవ‌కుల అవ‌గాహ‌న స‌మావేశంలో భాగంగా ఈ కార్యక్ర‌మం జ‌రిగింది.

ఈ సంద‌ర్బంగా ఆయ‌న కొన్ని ముఖ్య‌మైన అన్న‌మ‌య్య కీర్త‌న‌ల‌ను విజిల్‌తో వినిపించారు. ఇందులో కొండల‌లో నేలకొన్న కొనేటి రాయుడు వాడు….., బ్ర‌హ్మ‌మొక్క‌టే ప‌ర బ్ర‌హ్మ‌మొక్క‌టే …, పిడికిట‌ తలంబ్రాలు …, నారాయణతే నామో…., వేడుకుందామా…. మరియు భజన‌లు, గోవింద నామ సంకీర్తనలు …, గోవింద కృష్ణ జై … భ‌జ‌న‌లు శ్రీ‌వారి సేవ‌కుల‌ను భ‌క్తి సాగ‌రంలో ముంచెత్తాయి. ఈ కార్య‌క్ర‌మంలో కీబోర్డుపై శ్రీ భరద్వాజ్, తబలాపై శ్రీ మంజునాథ్, మృదంగం మీద ఓఎస్డి శ్రీ ఫనిరంగసాయి లయబద్ధమైన తోడుగా.

కాగా శ్రీ కె.శివ‌ప్ర‌సాద్ 1955లో బాప‌ట్ల‌లో జ‌న్మించారు. ప్ర‌ముఖ కర్ణాటక విద్యాంసులు  డాక్టర్ ఎం.బాలముర‌ళి కృష్ణ వ‌ద్ద శిక్ష‌ణ పొందిన ప్ర‌ముఖ క‌ర్ణాట‌క మ‌రియు హిందూస్థానీ సంగీత విద్యాంసులు.  ప్ర‌పంచ వ్యాప్తంగా 25 దేశాల‌లో 11 వేల‌కు పైగా విజిల్ సంగీత ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు.  ఆయ‌న శ్రీ త్యాగ‌రాజ‌స్వామి, శ్రీ ముత్తు స్వామి దీక్షితులు, శ్రీ అన్న‌మాచార్య సంకీర్త‌న‌లు, శ్రీ భ‌ద్రాచ‌ల రామ‌దాసు త‌దిత‌ర వాగ్గేయ‌కారుల కీర్త‌న‌లతో 20కి పైగా రూపొందించిన ఆల్భ‌మ్‌లు విశేష ఆద‌ర‌ణ పొందాయి. 1982 లో వశీ ఆర్ట్ థియేటర్స్ ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో శ్రీ ఎం.జి.రామచంద్రన్ మద్రాసులో ”ఆంద్రా నైటింగేల్” భిరుదుతో స‌న్మానించారు. అంతేగాక దేశ విదేశాల‌లో అనేక భిరుదులు, అవార్డులు పొందారు.  

టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అదనపు ఈవో శ్రీ ఏ.వి. ధర్మారెడ్డి ఒక గంటకు పైగా నిరంతరం ఈలలు మరియు భక్తి సంకీర్తన‌ల‌ను విని ఆయ‌న‌ను  బహుముఖ కళాకారుడ‌ని అభినందించి, శాలువ‌, శ్రీ‌వారి తీర్థ ప్ర‌సాదాల‌తో స‌త్క‌రించారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.