TTD EO PRESENTS SILK VASTRAMS TO SRI KALAHASTEESHWARA TEMPLE _ శ్రీకాళహస్తీశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఈవో
Tirupati, 28 February 2025: As part of the ongoing Sivaratri Brahmotsavams in the famous Vayulingeswara Swamy temple at Sri Kalahasti, on behalf of TTD, EO Sri Syamala Rao presented the silk vastrams on Friday.
The temple EO Sri T. Bapi Reddy welcomed TTD EO who presented the Pattu clothes on behalf of Tirumala Sri Venkateswara Swamy.
Later the TTD EO offered prayers to Sri Vayulingeswara and Goddess Gnana Prasunamba. Afterwards, he also had the darshan of Sri Dakshina Murthy.
Speaking to the media after the darshan, TTD EO said the temple of Srikalahasti is emerging as a great Shaivakshetra in South India as is also known as Dakshina Kasi. He added that the number of devotees coming to Srikalahasti temple is also increasing significantly. He said that the devotees coming to Tirumala to have a darshan of Srivari are also visiting the Srikalahasti temple as part of their visit to the temples in the surrounding area, and the TTD has provided the necessary facilities for the devotees in Tirupati. He reminded that devotees from all over the country come to Srikalahasteeshwaralaya and perform Rahuketu Puja.
As part of the temple annual Brahmotsavam, the marriage ceremony of Swami and Amma will be held today. He said that it has been a tradition for TTD to present Pattu Vastrams to Sri Kalahastiswara for the last 25 years.
Many temple officials participated in this program.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీకాళహస్తీశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఈవో
తిరుపతి, 2025, ఫిబ్రవరి 28: శ్రీ కాళహస్తీశ్వరుడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ తరపున ఈవో శ్రీ జె. శ్యామల రావు దంపతులు శుక్రవారం పట్టు వస్త్రాలు సమర్పించారు.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తరపున పట్టు వస్త్రాలు తీసుకుని వచ్చిన ఈవో దంపతులకు శ్రీకాళహస్తీశ్వరాలయం ఈవో శ్రీ టి. బాపిరెడ్డి ఆలయ సంప్రదాయాలతో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. వస్త్రాల సమర్పణల అనంతరం టిటిడి ఈవో దంపతులు వాయులింగేశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి దర్శనం చేసుకున్నారు. శ్రీ దక్షిణాది మూర్తి దర్శనం అనంతరం ఆలయ ఈవో వారికి స్వామివారి తీర్థ, ప్రసాదాలను అందించారు.
పట్టు వస్త్రాలు సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నా – శ్రీ జే. శ్యామల రావు, టిటిడి ఈవో
వాయులింగేశ్వరుడు, జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి దర్శనం అనంతరం టీటీడీ ఈవో మీడియాతో మాట్లాడారు. దక్షిణ భారతదేశంలో గొప్ప శైవక్షేత్రంగా శ్రీకాళహస్తి వెలుగొందుతోందన్నారు. శ్రీకాళహస్తి ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య కూడా విశేషంగా పెరగుతోందని ఆయన తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేస్తున్న భక్తులు పరిసర ప్రాంత ఆలయాల సందర్శనలో భాగంగా శ్రీకాళహస్తి ఆలయాన్ని కూడా దర్శించుకుంటున్నారని, భక్తులకు అవసరమైన సదుపాయాలను తిరుపతిలో టిటిడి కల్పించిందన్నారు. దేశ విదేశాల నుండి భక్తులు శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చి రాహుకేతు పూజలను నిర్వహిస్తున్నారని గుర్తు చేశారు. శ్రీకాళహస్తి ఆలయం పంచభూత స్థలాలలో ఒకటైన వాయు లింగానికి ప్రసిద్ధి చెందిందన్నారు. శ్రీవారి చెల్లెలు భ్రమరాంబ, చెల్లెలు సౌభాగ్యం కోసం శ్రీవేంకటేశ్వరుడు పట్టువస్త్రాలు పంపుతున్నారని మాట్లాడారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు స్వామి, అమ్మవారికి కళ్యాణోత్సవం జరుగుతుందన్నారు. శ్రీ కాళహస్తీశ్వరుడికి గత 25 సంవత్సరాలుగా టిటిడి పట్టు వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.ఈ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వరుడికి పట్టు వస్త్రాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, ఇలాంటి అవకాశం రావడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పలువురు ఆలయ అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది