SUBSTITUTE ACACIA WITH TRADITIONAL PLANTS – TTD EO _ అకేషియా చెట్ల స్థానంలో సంప్ర‌దాయ మొక్క‌ల పెంప‌కాన్ని వేగ‌వంతం చేయాలి : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

Tirumala, 24 August 2022: To preserve and protect the flora and bio-diversity in the Sesha Chala forest ranges, the TTD EO Sri AV Dharma Reddy on Wednesday urged the officials concerned to speed up the program of replacing the  Acacia with traditional plants.
 
 
 
Addressing a review meeting at the conference hall of the TTD administrative building in Tirupati on Wednesday he directed officials to extend the model project of substituting the Acacia in one hectare of land to larger tracts in the forest belt in a phased manner. He tasked officials to submit a comprehensive report on the program.
 
 
 
Among others, he instructed officials to take up beautification of Tirumala roads to give a pleasant atmosphere to devotees, speed up the Tarigonda Vengamamba Brindavanam works, digitisation of old TTD records and destroy the rest of unwanted ones, complete the gold lacing works of Sri Govindaraja swami temple Gopura by October and a comprehensive action plan to transform the Goshala in Tirupati on experts recommendation into a role model institution.
 
 
 
Later the TTD EO reviewed the Gopuja program underway in TTD local temples and made valuable suggestions to officials.
 
 
 
TTD JEOs Smt Sada Bhargavi, Sri Veerabrahmam, CVSO Sri Narasimha Kishore, FA& CAO Sri O Balaji, Chief Engineer Sri Nageswara  Rao and others were present.
 
 
 
ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అకేషియా చెట్ల స్థానంలో సంప్ర‌దాయ మొక్క‌ల పెంప‌కాన్ని వేగ‌వంతం చేయాలి : టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2022 ఆగ‌స్టు 24: తిరుమల శేషాచల అడవుల్లో వృక్షసంపదను, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించేందుకు అకేషియా(తుమ్మ) చెట్ల‌ను తొలగించి భూసారాన్ని పెంచాల‌ని, ఈ చెట్ల స్థానంలో సంప్రదాయ మొక్కల పెంప‌కం పనుల‌ను వేగ‌వంతం చేయాల‌ని టిటిడి ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి ఆదేశించారు. తిరుప‌తిలోని టిటిడి ప‌రిపాల‌నా భ‌వ‌నంలో గ‌ల స‌మావేశ మందిరంలో బుధ‌వారం సీనియ‌ర్ అధికారుల‌తో ఈవో స‌మీక్ష నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ఇప్ప‌టివ‌ర‌కు మోడ‌ల్ ప్రాజెక్టుగా ఒక హెక్టార్‌లో అకేషియా చెట్ల‌ను తొల‌గించి సంప్ర‌దాయ మొక్క‌ల పెంప‌కం చేప‌ట్టార‌ని, క్ర‌మంగా విస్త‌రించాల‌ని సూచించారు. ఈ ప‌నుల‌పై స‌మ‌గ్ర నివేదిక స‌మ‌ర్పించాల‌ని కోరారు. భ‌క్తుల‌కు ఆహ్లాద‌క‌రంగా ఉండేలా తిరుమ‌ల‌లో రోడ్ల సుంద‌రీక‌ర‌ణ ప‌నులు చేప‌ట్టాల‌న్నారు. తిరుమ‌ల‌లో నిర్మాణంలో ఉన్న త‌రిగొండ వెంగ‌మాంబ బృందావ‌నం ప‌నులు వేగ‌వంతం చేయాల‌ని ఆదేశించారు. టిటిడిలోని ప‌లు విభాగాల్లో ఉన్న పాత రికార్డుల‌ను ప‌రిశీలించి ముఖ్య‌మైన వాటిని డిజిటైజ్ చేయాల‌ని, మిగిలిన వాటిని తొల‌గించాల‌ని సూచించారు. తిరుప‌తిలోని శ్రీ గోవింద‌రాజ స్వామివారి ఆల‌య గోపురం బంగారు తాప‌డం ప‌నుల‌ను అక్టోబ‌రులోపు పూర్తి చేయాల‌న్నారు. తిరుప‌తిలోని గోశాలను ఆద‌ర్శ‌వంతంగా తీర్చిదిద్దేందుకు నిపుణుల సూచ‌న‌ల మేర‌కు స‌మ‌గ్ర ప్ర‌ణాళిక రూపొందించాల‌ని కోరారు. అనంత‌రం స్థానికాల‌యాల్లో జ‌రుగుతున్న గోపూజ‌పై ఈవో స‌మీక్షించారు.

ఈ స‌మావేశంలో జెఈవోలు శ్రీ‌మ‌తి స‌దా భార్గ‌వి, శ్రీ వీర‌బ్ర‌హ్మం, సివిఎస్వో శ్రీ న‌ర‌సింహ కిషోర్‌, ఎఫ్ఏసిఏవో శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వ‌ర‌రావు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.