TRI-MONTHLY SRIVARI METLOTSAVAM FROM AUGUST 25-27 _ ఆగ‌స్టు 25 నుండి 27వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం

ఆగ‌స్టు25 నుండి 27వ తేదీ వరకు శ్రీవారి త్రైమాసిక మెట్లోత్సవం
 
తిరుపతి, 2022 ఆగ‌స్టు 24: టీటీడీ ఆధ్వర్యంలోఆగ‌స్టు 25 నుండి 27వ తేదీ వరకు తిరుపతిలోని రైల్వేస్టేషన్‌ వెనుక గల టీటీడీ మూడో సత్ర ప్రాంగణంలో శ్రీవారి  త్రైమాసిక  మెట్లోత్సవం ఘనంగా  జరుగనుంది.
 
ఈ మూడు రోజుల పాటు ఉదయం 5 నుండి 7 గంటల వరకు భజన మండళ్లతో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన కార్యక్రమాలు చేప‌డ‌తారు. ఉదయం 8.30 గంటల నుండి 12.30 గంటల వరకు వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన భజన మండళ్ళతో సంకీర్తనలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు ధార్మిక సందేశాలు, మహనీయులు మాన‌వాళికి అందించిన ఉప‌దేశాలు తెలియ‌జేస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు సంగీత విభావరి, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.
 
ఆగ‌స్టు25న  సాయంత్రం 4 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుండి మూడో సత్రం ప్రాంగణం వరకు శోభాయాత్ర నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు అధికార ప్రముఖులు సందేశం ఇవ్వనున్నారు.ఆగ‌స్టు 27వ‌ తేదీ ఉదయం 4.30 గంటలకు అలిపిరి పాదాల మండపం వ‌ద్ద‌ మెట్లపూజ నిర్వహిస్తారు. అనంతరం వేల సంఖ్యలో వచ్చే భజన మండలి సభ్యులతో సాంప్రదాయ భజనలు చేస్తూ సప్తగిరీశుని చేరుకుంటారు.
 
గ‌తంలో ఎందరో మహనీయులు భక్తిప్రపత్తులతో వేంకటాద్రి పర్వతాన్ని కాలిన‌డ‌క అధిరోహించి స్వామి వారి అనుగ్రహం పొందారు . అలాంటివారి అడుగుజాడలలో నడిచి ఆ దేవదేవుని కృపకు అందరూ పాత్రులు కావాలనే తలంపుతో  దాస సాహిత్య ప్రాజెక్టు మెట్లోత్సవ కార్యక్రమం  చేపట్టింది. 
 
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirupati, 24 August 2022: TTD will be organizing the Tri-monthly Srivari Metlotsavam fete from August 25-27 at the 3rd NC Choultry behind the railway station under the aegis of the Dasa Sahitya Project of TTD.

During all three days, Dasa bhajana mandalis hailing from different states will be performing the suprabatham, Dhyanam and collective bhajan since the early hours followed by sankeertans of Kannada Haridasas.

In the afternoon Dharmic discourses and tributes to Saints and Swamijis will be rendered and finally Sangeeta vibhavari and cultural programs will be conducted

The highlights of the fete includes Shobha Yatra on August 25 from Sri Govindaraja swamy temple to Choultries followed by messages from prominent religious leaders. On August 27, the Metla puja will be performed in the early hours at Padala Mandapam near Alipiri. The pinnacle of the fete is the bhajan singing by thousands of bhajan artists with sankeertans climbing the Tirumala on foot.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI