GO MAHA SAMMELAN AT MAHATI AUDITORIUM ON OCTOBER 30-31 _ అక్టోబ‌రు 30, 31వ తేదీల్లో తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో ” గో మ‌హా స‌మ్మేళ‌నం “

– HIGHLIGHT ON GOSHALA- GO SAMRAKSHANA- GO BASED FARMING

 

– 1000 FARMERS FROM AP AND TELANGANA TO GET TRAINED

 

– TTD ADDITIONAL EO PRESS MEET 

 

Tirumala 14 Oct. 21: TTD additional Executive Officer Sri AV Dharma Reddy said on Thursday that TTD will organise a two day Go Maha Sammelan for farmers on October 30-31 to focus on Goshala maintenance and Go Samrakshana as part of Go based Organic farming in the country.

 

Addressing media persons at Annamaiah Bhavan on Thursday morning the TTD additional EO said the benchmark convention was organised at 

Mahati auditorium in collaboration with the Yuga Tulasi foundation and Sri Godham Mahathirtha Pathmeda of Rajasthan.

 

He said the objective is to provide awareness to 1000 farmers from Telugu states besides Tamilnadu and Karnataka on techniques and strategies of organic farming based on Cow based manures besides maintenance of Goshalas.

 

Speaking on the occasion the TTD Additional EO said the pesticide driven, agriculture had led to several diseases prone environment in the country and farming with Cow based manures alone could resolve them.

 

He said farming can be promoted with allied activity of dairy management of milk, curd, butter, and ghee besides Pancha Gavya products.

 

He said the objective of TTD was to bring back past glory to Indian agriculture by training young farmers in productive practices of Goshala maintenance, use of cow based fertilisers and manures to grow nutritional food.

 

He said the TTD is already promoting Go based products but offering Srivari naivedyam daily at Srivari Temple. Similarly TTD has also launched Go based arjita seva of Navaneeta Seva and also agarbatti’s made from used flowers at TTD sub temples. Soon TTD would launch 30 types of Pancha Gavya products.

Organic farming expert Sri Vijay Ram said young farmers were showing interest in organic farming methods and lauded TTD programs to benefit farmers. The program comprised of educating farmers to promote ground water in barren lands, breeding of Desi cows and Desi manures .The program will spread awareness and training on how to earn Rs.25, 000 per acre through organic farming. TTD will also assist organic farmers to market their products by entering into an agreement with farmers during the program.

 

He said the participant farmers will be given food made with organic products during Sammelan and also an exhibition on organic products organised for their benefit.

 

He said all participant farmers should follow covid guidelines interested in and those participating in the Sammelan should register on 6309111427, 93904 54573.

 

SCHEDULE OF GO MAHA SAMMELAN AT MAHATI AUDITORIUM:

 

October 30:

07.45 – Homas

0845- Lighting of lamp-Go puja, Vrushaba Puja.

11.00-1.00: Sammelan inauguration 

11.30- Lecture on history and significance of Cow Desi breeds etc 

1.30-2.30:Lunch of organic food

2.30-7.00 pm: Model Goshala maintenance, breeding desi cows, Fodders, Desi breeds, and significance of milch cows etc.

 

October 31: 

 

09.00- 1.00 noon: lecture on Go and Vedas Cow based products Cow based farming.

2.30-9.00 pm: Cultural programs- Lectures and mangala speech’s by Pontiffs and prominent Mutt heads from all over country on Go-puja  & cow based farming etc.

 

TTD JEO Sri Veerabrahmam, Yuga Tulasi foundation chairman and ex TTD board member Sri Shivkumar and others were present. 

 

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

అక్టోబ‌రు 30, 31వ తేదీల్లో తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళాక్షేత్రంలో ” గో మ‌హా స‌మ్మేళ‌నం “

– గోశాల నిర్వ‌హ‌ణ-గో ర‌క్ష‌ణ‌-గో ఆధారిత వ్య‌వ‌సాయంపై రైతుల‌కు అవ‌గాహ‌న

– ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి వెయ్యి మంది రైతుల‌కు శిక్ష‌ణ‌

– టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి

తిరుమల, 2021 అక్టోబ‌రు 14: తిరుప‌తిలోని మ‌హ‌తి క‌ళా క్షేత్రంలో అక్టోబ‌రు 30, 31వ తేదీల్లో టిటిడి ఆధ్వ‌ర్యంలో యుగ తుల‌సి ఫౌండేష‌న్ మ‌రియు రాజ‌స్థాన్‌లోని ప‌త్ మేడకు చెందిన శ్రీ గోధాం మ‌హాతీర్ధ్ వారి సౌజ‌న్యంతో ” గోశాల నిర్వ‌హ‌ణ-గో ర‌క్ష‌ణ‌-గో ఆధారిత ” వ్య‌వ‌సాయంపై ఆంధ్ర‌, తెలంగాణ రాష్ట్రాల‌కు చెందిన వెయ్యి మంది రైతుల‌కు అవ‌గాహ‌న‌ కార్య‌క్ర‌మం నిర్వ‌హించ‌నున్న‌ట్లు టిటిడి అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి తెలిపారు. తిరుమ‌ల‌లోని అన్న‌మ‌య్య భ‌వ‌నంలో గురువారం ” గో మ‌హా స‌మ్మేళ‌నం ” పై మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్బంగా అద‌న‌పు ఈవో మాట్లాడుతూ నేటి స‌మాజం ర‌సాయ‌న ఎరువులతో పండించిన పంట‌లు తింటూ ఆనారోగ్యంతో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నార‌ని, గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండించిన పంటల ద్వారా ఉన్న రోగాలను కూడా దూరం చేసుకోవచ్చ‌న్నారు. గోవును పాల కోస‌మే కాక వాటి నుండి ల‌భించే పంచగ‌వ్యాలతో త‌క్కువ ఖ‌ర్చుతో వ్య‌వ‌సాయం చేయ‌వ‌చ్చ‌ని చెప్పారు. గో సంరక్షణకు కృషి చేస్తున్న‌ వారి సలహాలు, సూచనలు తీసుకుంటామ‌న్నారు. యువ రైతుల‌ను ప్ర‌కృతి వ్య‌వ‌సాయం చేసేందుకు ప్రోత్స‌హించ‌డం ద్వారా గ్రామాల‌కు పూర్వ వైభ‌వాన్ని తీసుకురావ‌డంతో పాటు, స‌మాజానికి మంచి పోష‌క విలువ‌లు ఉన్న అహారం అందించ‌వ‌చ్చ‌ని చెప్పారు.

ఇప్ప‌టికే టిటిడి గో ఆధారిత వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల‌తో శ్రీ‌వారికి నైవేధ్యం స‌మ‌ర్పిస్తోంద‌న్నారు. అదేవిధంగా న‌వ‌నీత సేవ‌, అగ‌ర‌బ‌త్తులు భ‌క్తుల‌కు అందుబాటులోనికి తీసుకువ‌చ్చామ‌న్నారు. త్వ‌ర‌లో ప‌చ‌గ‌వ్యాల‌తో త‌యారు చేసిన దాదాపు 30 ర‌కాల ఉత్ప‌త్తులను అందుబాటులోకి తీసుకురానున్న‌ట్లు తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల రైతులు ఈ కార్యక్రమానికి తరలి రావాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు.

అనంత‌రం ప్రకృతి వ్యవసాయ వేత్త శ్రీ విజయరామ్ మాట్లాడుతూ కోవిడ్ తర్వాత ప్రకృతి వ్యవసాయంపై యువ రైతులు ఆసక్తి చూపుతున్నార‌న్నారు. టిటిడి చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాల ద్వారా రైతులకు మేలు జరగబోతోంద‌ని చెప్పారు. ఇందులో ఎండిన భూమిలో నీటిని దాచుకునే విధానాన్ని, దేశీ ఆవులు, దేశీ విత్తనాల ప్రాముఖ్యత వివరిస్తామ‌న్నారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎకరాకు రూ.25 వేలు సంపాదించుకునేలా శిక్షణనిస్తామ‌ని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను మార్కెటింగ్ చేసుకునేందుకు రైతులను ఈ కార్యక్రమం ద్వారా టిటిడికి అనుసంధానం చేస్తామ‌న్నారు. గో మహా సమ్మేళనంలో పాల్గొనే రైతుల‌తో గో ఉత్ప‌త్తుల‌తో ప్ర‌ద‌ర్శ‌న, ప్రకృతి సిద్ధ భోజనం వడ్డిస్తామ‌ని చెప్పారు. ఈ కార్యక్రమానికి విచ్చేసే రైతులు కోవిడ్ – 19 నిబంధ‌న‌లు పాటిస్తూ పాల్గొనాల‌న్నారు. గో మహా సమ్మేళనంలో పాల్గొనదలచిన భక్తులు 6309111427, 93904 54573 నెంబర్లకు సంప్రదించి వివరాలు నమోదు చేసుకోవాల‌ని ఆయ‌న వివ‌రించారు.

” గో మ‌హా స‌మ్మేళ‌నం ” కార్య‌క్ర‌మాల వివ‌రాలు :

మ‌హ‌తి క‌ళా క్షేత్రంలో అక్టోబ‌రు 30న ఉద‌యం 7.45 గంట‌ల‌కు హోమ‌ము, ఉద‌యం 8.45 గంట‌ల‌కు జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న‌, గో పూజ‌, వృష‌భ‌ పూజ‌, ఉద‌యం 11 గంట‌ల‌కు స‌మావేశం ప్రారంభ‌మ‌వుతుంది. ఉద‌యం 11.30 గంట‌ల నుండి ఇతిహాస కాలం నుండి వ‌ర్త‌మాన కాలం వ‌ర‌కు గోవు యొక్క ఉనికి, దేశీ గో జాతులు-ప్రాముఖ్య‌తపై ఉప‌న్యాసం నిర్వ‌హిస్తారు. మ‌ధ్యాహ్నం 2.30 రాత్రి 7 గంట‌ల వ‌ర‌కు గోశాల‌లు- అద‌ర్శ గో శాల‌ల నిర్వ‌హ‌ణ‌, గో పోష‌ణ‌-ప‌శుగ్రాసాలు-జాతి అభివృద్ధి, దేశీ గోక్షీర ప్రాశ‌స్త్య‌ము గురించి శిక్ష‌ణ ఇస్తారు.

అక్టోబ‌రు 31న ఉద‌యం 9 నుండి మ‌ధ్యాహ్నం 1 గంట వ‌ర‌కు గో ఆధారాత వ్య‌వ‌సాయ‌ము, గో విలువ ఆధారిత ఉత్ప‌త్తులు, వేద‌ముల‌లో గోవు త‌దిత‌ర అంశాల‌పై ప్ర‌సంగిస్తారు. మ‌ధ్యాహ్నం 2.30 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు, గో పూజ‌, దేశంలోని ప్ర‌ముఖ మ‌ఠాదిప‌తులు, పీఠాదిప‌తులు అనుగ్ర‌హ భాష‌ణం ఇవ్వ‌నున్నారు.

ఈ స‌మావేశంలో జెఈవో శ్రీ వీర‌బ్ర‌హ్మం, యుగ తుల‌సి ఫౌండేష‌న్ ఛైర్మ‌న్ మ‌రియు టిటిడి బోర్డు మాజీ స‌భ్యులు శ్రీ శివ‌కుమార్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.