SRI MALAYAPPA AND CONSORTS SPARKLE SARVA BHUPALA VAHANA _ సర్వభూపాల వాహ‌నంపై శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్ప

Tirumala, 14 Oct. 21: On the eighth day of the ongoing Srivari annual Brahmotsavam, Sri Malayappa and his consorts Sridevi and Bhudevi sparkled on Sarva Bhupala vahana stationed at Kalyana Mandapam inside Srivari temple on Thursday morning.

Traditionally Rathotsavam  (wooden chariot) is organised on the penultimate day of Brahmotsavam but in view of covid guidelines, TTD held Sarva Bhupala vahana as an alternative.

The term ‘Sarvabhoopala’ means ‘Emperor of Entire Universe. Sarva bhoopala meaning the God in charge of the earth, water and air become the pall bearers of Sri Malayappa vehicle. The objective is to display that all the Dikpalas of the universe were not just under the control of Lord Venkateswara but also that there was no chance for misuse of office by them under his diligent vigilance and directions.

Tirumala pontiffs, AP assembly Deputy speaker Sri Kona Raghupati, TTD EO Dr KS Jawahar Reddy couple, TTD board members met Prashanti Reddy, Sri AP Nanda Kumar, Additional EO Sri AV Dharma Reddy couple, CVSO Sri Gopinath Jatti couple, VGO Sri Bali Reddy, Temple DyEO Sri Ramesh Babu and others were present.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

2021 శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు

సర్వభూపాల వాహ‌నంపై శ్రీదేవి, భూదేవి స‌మేత శ్రీ మలయప్ప

తిరుమ‌ల‌, 2021 అక్టోబ‌రు 14: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు గురువారం ఉదయం 7.35 నుండి 9 గంటల వ‌ర‌కు రథోత్సవం బదులుగా శ్రీవారి ఆలయంలోని క‌ల్యాణోత్సవ మండ‌పంలో శ్రీమలయప్ప స్వామివారు ఉభయదేవేరులతో కలిసి సర్వభూపాల వాహ‌నంపై దర్శనమిచ్చారు.

సర్వభూపాల అంటే రాజుల‌కు రాజు అని అర్థం. ఈ ప్ర‌పంచాన్ని మొత్తం పాలించే రాజు తానేనని భ‌క్త లోకానికి చాటి చెపుతూ స్వామివారు ఈ వాహ‌నాన్ని అధిష్టించారు.

ఈ కార్యక్రమంలో శ్రీ‌శ్రీ‌శ్రీ పెద్ద‌జీయ‌ర్‌స్వామి, శ్రీ‌శ్రీ‌శ్రీ చిన్న‌జీయ‌ర్‌స్వామి, శాసనసభ ఉప సభాపతి శ్రీ కోన రఘుపతి, టిటిడి ఈవో డాక్ట‌ర్‌ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి దంప‌తులు, బోర్డు స‌భ్యులు శ్రీ‌మ‌తి ప్ర‌శాంతి రెడ్డి, శ్రీ ఎపి.నందకుమార్, అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, సివిఎస్వో శ్రీ గోపినాథ్ జెట్టి దంపతులు, విజివో శ్రీ బాలిరెడ్డి, ఆల‌‌య డెప్యూటీ ఈవో శ్రీ ర‌మేష్‌బాబు ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.