SPECIALLY ABLED CHILDREN AND AGED WORSHIP IN TIRUMALA SHRINE _ శ్రీవారిని దర్శించున్న అనాథలు, అంధులు, దివ్యాంగులు

TIRUMALA, 25 APRIL 2023: Darshan of Lord Sri Venkateswara, a mirage all these years, brought bright shine and cheers on the faces of hundreds of children and aged on Tuesday, as over 1000 plus deaf and dumb besides aged persons had darshan in Tirumala shrine.

 

With the initiative by Chennai Local Advisory Committee  Chief Sri Sekhar Reddy and Rajasthan Youth Association and Chennai Food Bank, 1008 children were provided Srivari Darshan by the TTD through the physically challenged and senior citizens darshan line. Temple DyEO Sri Lokanatham, VGO Sri Bali Reddy were also present.

 

The 1000 plus includes 160 Blind, 100 physically disabled, 108 elderly persons, 50 mentally retarded and remaining orphans. Sky’s the limit for the rejoice of these special devotees who were aged between 5years and 70years. They expressed immense pleasure for having the darshan of Sri Venkateswara Swamy. For a majority it was their maiden visit to the abode of Srivaru and they were thrilled with the darshan.  They thanked the Organisers and  TTD  for providing them a lifetime opportunity to have Lord Sri Venkateswara’s divine darshan.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

 

శ్రీవారిని దర్శించున్న అనాథలు, అంధులు, దివ్యాంగులు

తిరుమల, 25 ఏప్రిల్ 2023: శ్రీవారి దర్శనంతో వందలాది మంది అనాథలు, అంధులు, దివ్యాంగులు పులకించిపోయారు. చెన్నై స్థానిక సలహా మండలి అధ్యక్షులు శ్రీ శేఖర్ రెడ్డి చొరవతో రాజస్థాన్ యూత్ అసోసియేషన్, చెన్నై ఫుడ్ బ్యాంకు ఆధ్వర్యంలో 1008 మంది అనాథలు, అంధులు, దివ్యాంగులు మంగళవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ లోకనాధం, విజివో శ్రీ బాలిరెడ్డి కలిసి వృద్ధులు, దివ్యాంగుల క్యూలైన్ ద్వారా వీరికి దర్శన ఏర్పాట్లు చేశారు.

శ్రీవారిని దర్శించుకున్న వారిలో 160 మంది అంధులు, 100 మంది దివ్యాంగులు, 108 మంది వృద్ధులు, 50 మంది మానసిక వికలాంగులు, ఆనాథలు కలిపి మొత్తం 1,008 మంది ఉన్నారు. వీరిలో ఐదేళ్ల చిన్నారుల నుంచి 70 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు. వీరిలో ఎక్కువమంది మొదటిసారి శ్రీవారిని దర్శించుకున్న వారే కావడం విశేషం. శ్రీవారి దర్శనంతో వీరి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తమ మనోనేత్రంతో స్వామివారిని దర్శించుకున్నామని పలువురు అంధులు సంతోషం వ్యక్తం చేశారు. చక్కటి స్వామి వారి దర్శనం కల్పించినందుకు వీరు నిర్వాహకులకు, టీటీడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. దర్శనానంతరం తరిగొండ వెంగమాంబ కాంప్లెక్స్ లో అన్నప్రసాదాలు స్వీకరించారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.