అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు ప్రారంభం

అన్నమయ్య వర్ధంతి ఉత్సవాలు ప్రారంభం

తిరుపతి, ఏప్రిల్‌  07, 2013: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమయ్య 510వ వర్ధంతి ఉత్సవాలు తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో ఆదివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏడు రోజుల పాటు జరుగనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజు ”దినము ద్వాదశి”, ”సప్తగిరి సంకీర్తనలు” గోష్టిగానం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉదయం 8.00 గంటలకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు సంకీర్తన పూజ నిర్వహిస్తారు. ఉదయం 10.30 గంటలకు తిరుపతికి చెందిన కుమారి ఎ.కుమారి బృందం హరికథ కాలక్షేపం జరుగనుంది. సాయంత్రం 6.00 నుండి 7.30 గంటల వరకు తిరుపతికి చెందిన జి.రాధ బృందం గాత్ర సంగీత సభ నిర్వహించనున్నారు. రాత్రి 7.45 నుండి 9.00 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ ఎస్‌.వి.ఆనందభట్టర్‌ బృందం ఆధ్వర్యంలో గాత్ర కచేరి జరుగనుంది.

అదేవిధంగా తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 5.00 నుండి రాత్రి 9.00 గంటల వరకు కుమారి ఎస్‌.అనూష బృందం గాత్రం, శ్రీ జి.మధుసూదనరావు బృందం సంగీత సభ, తిరుపతికి చెందిన అభినయ ఆర్ట్స్‌ వారి నృత్య కార్యక్రమాలు జరుగనున్నాయి.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.