అన్న‌మ‌య్య‌ సంకీర్త‌న‌ల‌పై నిరంత‌ర ప‌రిశోధ‌న‌లు : టిటిడి ఈవో _ COMPLETE PURANAM TRANSLATIONS BY 2022 BRAHMOTSAVAMS- TTD EO

Tirupati,24 September 2021: TTD Executive Dr KS Jawahar Reddy has directed the TTD Pundit Mandali on Friday evening to complete the translation works of all Astadasha Puranas taken up under Purana Itihas project ahead of next year annual Brahmotsavams without fail.

Addressing the TTD pundit mandali at the SVETA conference hall he said only four Puranas translation has been completed so far and rest of 14 Puranas translation should be completed by annual Brahmotsavam next year, by roping in services of more pundits, if necessary.

He said presently pundits were working on, the project for 7 days in a month which could be enhanced to 10 days in a month here afterwards.

The EO said free accommodation shall be provided to both the pundits and their spouses when they come to Tirupati for translation work.

He informed the pundits committee that there was tremendous popular response for the parayanams of Garudapurana, Bhagavadgita and other Parayanams taken up since the commencement of pandemic Corona.

He said the SVBC channel is keen to telecast all the 18 Puranas and urged the pundits to translate the Puranas in an easy language for common devotees benefit and the young generation to choose the right path with understanding of Puranas and the historical legacy of the nation.

Earlier the TTD EO presented Srivari Thirtha Prasadams to pundita Parishad members.

OSD of Puranas and Itihas project Dr Akella Vibhishana Sharma,SVETA Director Dr Ramanjula Reddy, Pundit Parishad member Dr Samudrala Lakshmaiah, Sri Sripada Satyanarayana were also present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

అన్న‌మ‌య్య‌ సంకీర్త‌న‌ల‌పై నిరంత‌ర ప‌రిశోధ‌న‌లు : టిటిడి ఈవో

తిరుమ‌ల‌, 2021 సెప్టెంబరు 24: పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్త‌న‌ల‌పై నిరంత‌రం ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించేందుకు తిరుప‌తిలోని కేంద్రీయ సంస్కృత విశ్వ‌విద్యాల‌యంలో ” అన్న‌మ‌య్య పీఠం ” ఏర్పాటుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఈ విష‌య‌మై సంస్కృత విశ్వ‌విద్యాల‌యం ఉప‌కుల‌ప‌తితో చ‌ర్చించాల‌న్నారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో శుక్ర‌వారం టిటిడి ధార్మిక ప్రాజెక్టుల‌పై ఈవో అధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ డిజిటలైజేషన్ చేసిన అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌ను టిటిడి వెబ్‌సైట్‌లో ఉంచాల‌న్నారు. అన్న‌మ‌య్య సంకీర్త‌న‌ల‌కు విస్తృత ప్ర‌చారం క‌ల్పించేందుకు ” అదివో…అల్ల‌దివో ” కార్య‌క్ర‌మాన్ని ప‌టిష్టంగా నిర్వ‌హించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. అన్న‌మ‌య్య‌, వెంగ‌మాంబ సంకీర్త‌న‌ల‌పై త్వ‌ర‌లో వ్యాస ర‌చ‌న‌, వక్తృత్వ, క్వీజ్ పోటీలు నిర్వ‌హించాల‌న్నారు. ఇప్ప‌టివ‌ర‌కు ల‌భ్య‌మైన 14 వేల అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లకు అర్థ‌, తాత్ప‌ర్య విశేషాంశాల‌తో ” అన్న‌మ‌య్య సాహిత్య‌ లహ‌రి ” పేరుతో భ‌క్తుల‌కు అందుబాటులోకి తీసుకురావాల‌ని చెప్పారు.

అదేవిధంగా దాస సాహిత్యంలోని 5 నుండి 10 వేల దాస సంకీర్త‌న‌ల‌ను సేక‌రించేందుకు కృషి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. దాస సాహిత్య‌నికి విస్తృత ప్ర‌చారం క‌ల్పించేందుకు క‌ర్ణాట‌క‌లోని బెంగూళూరు విశ్వ‌విద్యాల‌యంతో ఒప్ప‌దం చేసుకోవాల‌ని సూచించారు. దాస సాహిత్య కీర్త‌న‌లు ప్ర‌చారం చేసేందుకు ఎస్వీబీసిలో ప్ర‌త్యేక టైం స్లాట్ కేటాయించాల‌న్నారు. ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టు రికార్డు చేసిన 300 దాస సంకీర్త‌న‌ల‌తో ” దాస న‌మ‌నం ” పేరుతో క‌ర్ణాట‌క‌లో పాటల‌ పోటీలు నిర్వ‌హించాల‌ని ఈవో ఆదేశించారు.

అనంత‌రం నాళాయిర దివ్యప్రబంధ ప్రాజెక్టు, ఆళ్వార్ దివ్య ప్ర‌బంధ ప్రాజెక్టు, ఎస్వీ రికార్డింగ్ ప్రాజెక్టుల‌పై ఈవో స‌మీక్షించారు.

అద‌న‌పు ఈవో శ్రీ ఎవి.ధ‌ర్మారెడ్డి, ఎఫ్ఎ అండ్ సిఏవో శ్రీ బాలాజి, టిటిడి ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రాం అధికారి శ్రీ విజ‌య‌సార‌ధి, అన్న‌మాచార్య‌, వెంగ‌మాంబ ప్రాజెక్టుల సంచాల‌కులు శ్రీ ఆకెళ్ల విభీష‌ణ శ‌ర్మ‌, దాస‌సాహిత్య ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి శ్రీ పి.ఆర్‌.ఆనంద తీర్థాచార్యులు ఈ స‌మీక్ష స‌మావేశంలో పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.

Tirumala, 24 September 2021: TTD Executive Officer Dr KS Jawahar Reddy has said that the TTD will set up an Annamaiah Chair at the National Sanskrit University in Tirupati to conduct comprehensive research on the patriarch of prose poetry, Sri Tallapaka Annamacharya.

 

During a review meeting held on TTD projects at Annamaiah Bhavan on Thursday evening, the TTD EO directed the officials to take necessary measures in this direction.

 

Speaking on the occasion the TTD EO instructed officials to upload the digital version of Annamaiah Sankeetans on the TTD website and also provide wide publicity to the new SVBC program, “Adivo…Alladivo”.

 

He urged officials to organise quiz, essay writing and oratory contests on the Sankeetans of Annamaiah and Vengamamba.

 

He asked officials to conceive  Annamaiah Lahiri program with complete with definition, significance etc. of all the available 14,000 Annamaiah Sankeertans.

 

Similarly, the TTD EO instructed officials to strive to gather all the 5,000 to 10,000  Dasa Sankeertans from Dasa Sahitya and also sign an agreement with Bangalore University Karnataka to provide wide publicity to Dasa Sahitya.

 

He asked officials to promote publicity on a prime slot for Dasa Sahitya Sankeetans on SVBC and also conduct contests titled Dasa Namana for Dasa Sankeertans from the 300 Sankeetans recorded by the SV Recording Project.

 

The TTD EO also reviewed the activities of the Divya Prabandam Project, SV Recording Project and made valuable suggestions.

 

Additional EO Sri AV Dharma Reddy, FA& CAO Sri O Balaji, TTD Dharmic projects Program Officer Sri Vijaya Saradhi, Annamacharya-Vengamamba Project Director Sri Akella Vibhishana Sharma, Dasa Sahitya Project OSD Sri PR Anandathirthacharyulu were present.

 

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI