PERVASIVE ARRANGEMENTS FOR SRI SITA RAMA KALYANAM AT VONTIMITTA ON APRIL 15: YSR KADAPA DISTRICT COLLECTOR _ ఏప్రిల్‌ 15న ఒంటిమిట్ట శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు

PRESTIGIOUS SRI KODANDARAMA BRAHMOTSAVAM

Tirupati, 16 Mar. 22: YSR Kadapa District Collector Sri Vijayarama Raju said on Wednesday that comprehensive arrangements and preparations have been made for the conduction of Sri Ramanavami Brahmotsavam from April 10-18 after two years of Covid, to make it a landmark event.

The collector reviewed and also inspected all arrangements for the prestigious fete of Sri Sita Rama kalyanotsavam and the annual Brahmotsavam along with TTD JEO Sri Veerabrahmam on Wednesday at TTD Kalyan Mandapam at Vontimitta.

Speaking on the occasion the District Collector said the district administration was all set for coordinated efforts with the TTD administration to ensure the grand success of the prestigious fete.

He said extensive preparations were suggested for the illustrious Sri Sita Ram Kalyanam slated for April 15 and foolproof arrangements were made in view of the anticipated visit of dignitaries including ministers, MLAs, MPs etc.

He said both TTD officials and District officials have been tasked to make perfect measures inside temple abs Kalyana Vedika

Similarly, Accommodation, security sanitisation, temporary toilets, drinking water, Anna Prasadam, power supply, traffic control, RTC, signboards control room, CC cameras, electrical decorations fire services, health and medical camps, help desk arrangements have been organised.

TTD JEO Sri Veerabrahmam said the glittery event of Sri Sita Rama Kalyanam is all set with electrical and flower decorations besides shelters for devotees to view the event comfortably at night.

He said officials were directed to make all arrangements among others arrangements for drinking water, buttermilk packets, Anna Prasadam counters, temporary toilets, parking lots, Special buses by RTC, galleries near Kalyan Vedika, arches and LED screens are being organised.

He said TTD health and medical wing officials along with State government health officials have been instructed to set up medical camps, paramedics, medicine, ambulances, glucose ORS packets and also for garbage clearance to avert pollution.

The TTD vigilance and district police will together ensure foolproof security with CC cameras Traffic control, parking etc.,

Joint Collector Sri Saikant Varma, TTD CE Sri D Nageswara Rao, DyEOs Sri Ramana Prasad, Sri Govindarajan, Vigilance Security Offer Sri Manohar, Rajampeta RDO Sri Chandramouli, DWAMA and DRDA PDS Sri Yadubhushan Reddy Sri Murali Manohar, DPA Sri Prabhakar Reddy, DMHO Dr Nagaraj, Kadapa Municipal Commissioner Sri Rangaswami, Tourism officer Sri Rajasekhar Reddy, Power SE Smt Shobha Valentina, and other officials of district and TTD were Present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఏప్రిల్‌ 15న ఒంటిమిట్ట  శ్రీ సీతారాముల కల్యాణానికి విస్తృత ఏర్పాట్లు
 
ప్రతిష్టాత్మకంగా కోదండరాముని బ్రహ్మోత్సవాలు
 
వై ఎస్ ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ విజయరామరాజు
 
తిరుపతి   16 మార్చి 2022: చారిత్రాత్మక ప్రాశస్త్యం గల ఒంటిమిట్ట శ్రీకోదండరామాలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వై వైఎస్సార్ జిల్లా కలెక్టర్ శ్రీ విజయరామరాజు చెప్పారు.  ఏప్రిల్15న శ్రీ సీతారాముల కళ్యాణానికి  విస్తృత ఏర్పాట్లు  చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం తో కలసి బుధవారం ఆయన ఏర్పాట్లకు సబంధించిపరిశీలన చేశారు. అనంతరం   టిటిడి కళ్యాణ మండపం సమీపంలోని సమావేశ హాలులో టీటీడీ జెఈఓ వీరబ్రహ్మంతో కలిసి  బ్రహ్మోత్సవాలు, కల్యాణోత్సవ ఏర్పాట్లపై జిల్లా, టీటీడీ అధికారులతో సమీక్ష నిర్వహించి ఏర్పాట్లపై దిశా నిర్ధేశం చేశారు.
 
ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ, ఏప్రిల్‌ 10 నుండి 18వ తేదీ వరకు శ్రీకోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు టీటీడీ విస్తృత ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం జిల్లా యంత్రాగం పూర్తి సహకారం అందిస్తుందన్నారు.  ఏప్రిల్‌ 15వ తేదీన శ్రీసీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించేందుకు గతంలో కంటే మెరుగైన ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక కావడం, రాష్ట్ర ప్రముఖులు విచ్చేయనుండడంతో జిల్లా యంత్రాంగం టీటీడీతో కలిసి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు.  కళ్యాణోత్సవానికి సంబంధించి ఆలయం లోపల, కళ్యాణ వేదిక వద్ద ఎటువంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి జిల్లా యంత్రాంగం తరఫున వివిధ శాఖల అధికారులకు, టిటిడి తరపున ఆయా విభాగాల అధికారులకు  బాధ్యతలు అప్పగించామని చెప్పారు. వాటిని సమన్వయంగా పూర్తిచేసి కల్యాణోత్సవాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు కావాల్సిన అన్ని రకాల మౌలిక వసతుల ఏర్పాట్లు పూర్తిచేయాలని, భద్రత , శానిటేషన్, తాత్కాలిక మరుగుదొడ్లు, తాగునీరు,  అన్నప్రసాదాలు,  విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ కంట్రోల్, ఆర్టీసీ రవాణా సౌకర్యం, సూచిక బోర్డులు, కంట్రోల్ రూం, సీసీ కెమెరాలు, రాత్రి వేళలో కల్యాణోత్సవం చేస్తున్నందున విద్యుదీకరణ అంశాలు, అగ్నిమాపక వాహనం , వైద్య ఆరోగ్యశాఖ వారిచే వైద్య శిబిరం, హెల్ప్ డెస్క్ ల ఏర్పాటు తదితర అంశాల పై సమీక్షించి పలు సూచనలు జారీ చేశామన్నారు. కోవిడ్ నేపథ్యంలో మాస్కులు కూడా సరఫరా చేయాలని సూచించారు. 
 
టీటీడీ జెఈవో శ్రీ వీరబ్రహ్మం మాట్లాడుతూ, జిల్లా యంత్రాంగం సమన్వయంతో శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను  పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కల్యాణవేదిక వద్ద భక్తులు కూర్చునేందుకు వీలుగా షెల్టరు ఏర్పాటు చేస్తున్నారని, కల్యాణవేదికను సాంప్రదాయ బద్ధంగా, సర్వాంగసుందరంగా పుష్పాలంకరణలతో అలంకరించనున్నట్లు తెలియజేశారు. భక్తులకు అందుబాటులో తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, అన్నప్రసాద వితరణ కౌంటర్లను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.  కళ్యాణ వేదిక వద్ద తాత్కాలిక, మొబైల్‌ మరుగుదొడ్లు, నీటి వసతి, పార్కింగ్‌ ప్రదేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ఎపిఎస్‌ ఆర్‌టిసి ద్వారా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కల్యాణ వేదిక వద్ద గ్యాలరీలు, పటిష్టమైన బ్యారికేడ్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.భక్తులను విశేషంగా ఆకట్టుకునేలా విద్యుత్‌, పుష్పాలంకరణలు, స్వాగత ఆర్చిలు, ఎల్‌ఇడి బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్‌ ఆధ్వర్యంలో శ్రీ సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపారు. 
 
టిటిడి ఆరోగ్య విభాగం అధికారులు, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తారన్నారు. భక్తుల కోసం పథమ చికిత్స కేంద్రాలతో పాటు పారామెడికల్‌ సిబ్బంది, మందులు, అంబులెన్సులు, గ్లూకోజ్‌, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. మెరుగైన పారిశుద్ధ్య ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. 
 
టిటిడి విజిలెన్స్‌ సిబ్బంది, జిల్లా పోలీసు యంత్రాంగం కలిసి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తారన్నారు. అవసరమైన అన్ని ప్రాంతాలలో సిసి టివిలు, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లా అధికార యంత్రాంగం, స్థానికులు టిటిడికి సహకరించి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని జెఈవో కోరారు.
 
ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ శ్రీ  సాయికాంత్ వర్మ, టిటిడి చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ డి.నాగేశ్వరరావు, డిప్యూటీ ఈఓలు శ్రీ రమణప్రసాదు, శ్రీగోవింద రాజన్, విజిలెన్స్ సెక్యురిటి అధికారి శ్రీ మనోహర్, రాజంపేట ఆర్‌డివో శ్రీ చంద్రమౌళి, డ్వామా, డిఆర్డిఎ పీడీ లు శ్రీ యదుభూషన్ రెడ్డి, శ్రీమురళి మనోహర్, డిపిఓ శ్రీప్రభాకర్ రెడ్డి, డిఎంహెచ్ఓ డా.నాగరాజు, కడప మునిసిపల్ కమీషనర్ శ్రీ రంగస్వామి, టూరిజం అధికారి శ్రీ రాజశేఖర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీమతి శోభ వాలెంటినా, వివిధ శాఖల జిల్లా అధికారులు, టిటిడి అధికారులు పాల్గొన్నారు.
 
టీటీడీ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.