EXTENSIVE ARRANGEMENTS FOR TUMBURU THEERTHA MUKKOTI ON MARCH 18 _ మార్చి 18న తుంబురుతీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి
A review meeting on the preparations and arrangements were held at the Tirumala Command Control Centre by TTD VGO Sri Bali Reddy with Vigilance, traffic, police, RTC, Fire services and other TTD officials.
Speaking on the occasion the TTD VGO said the devotees would be allowed to visit the Thumburu theertha in Seshachala forests from March 17 morning 06.00 am to evening 4.00 pm and similarly from morning to evening of March 18, same timings. In view of security reasons, the devotees will not be allowed to stay overnight and also visit during nights and appealed to devotees to cooperate.
He said the TTD Anna Prasadam wing would provide Anna Prasadam to devotees on both days at the Papavinasham dam where Primary health Centre, two ambulances will be stationed besides a doctors team will be available at the theertha site.
He said a public address system will also be organised for announcements cautioning devotees to not carry any cooking utensils, camphor, matchboxes. An eighty member health workers team shall also be deployed and full security to devotees with police, forest, TTD vigilance coordination and also avert any fire accidents.
Anna Prasadam DyEO Sri Harindranath, OSD Sri GLN Shastri, Ashwini hospital Superintendent Dr Kusuma Kumari, Tirumala 1&2 town CIS, Sri Jaganmohan Reddy, Sri Chandrasekhar, Tirumala RTC D! Sri Vishwanath, health unit officer Sri Amarnath Reddy, FRO Sri Prabhakar Reddy, AVSOs Sri Giridhar, Sri Shivaiah, VIs Sri Satish, Sri Shivshankar, Sri Pratap and other officials were present.
ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI
మార్చి 18న తుంబురుతీర్థ ముక్కోటికి విస్తృత ఏర్పాట్లు : టిటిడి
తిరుమల, 2022 మార్చి 16: తిరుమల శేషాచల అడవుల్లో ప్రముఖ తీర్థాల్లో ఒకటైన తుంబురు తీర్థముక్కోటికి మార్చి 17, 18వ తేదీల్లో విశేషంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టిటిడి విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. తిరుమల కమాండ్ కంట్రోల్ సెంటర్ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం తిరుమల విజివో శ్రీ బాలిరెడ్డి ఆధ్వర్యంలో తుంబురు తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై విజిలెన్స్, పోలీస్, ట్రాఫిక్, ఆర్‌టిసి, అగ్నిమాపక, టిటిడిలోని వివిధ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా విజివో మాట్లాడుతూ తుంబురు తీర్థానికి మార్చి 17వ తేదీ ఉదయం 6 నుండి సాయంత్రం 4 గంటలవరకు, మరల తిరిగి మార్చి 18వ తేదీ ఉదయం 6 నుండి 10 గంటల వరకు భక్తులను అనుమతించనున్నట్లు తెలిపారు. భక్తుల భద్రత దృష్ట్యా మార్చి 17వ తేదీ రాత్రి ఎట్టి పరిస్థితుల్లో తీర్థానికి అనుమతిలేదని, ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
టిటిడి అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాపవినాశనం డ్యామ్ వద్ద మార్చి 17, 18వ తేదీల్లో అన్నప్రసాదాలు భక్తులకు అందించనున్నట్లు చెప్పారు. పాపవినాశనం డ్యామ్ వద్ద ప్రథమ చికిత్స కేంద్రం, రెండు అంబులెన్స్, తుంబురు తీర్థం వద్ద ఒక వైద్యబృందాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ఆర్‌టిసివారు తగినన్ని బస్సులను ఏర్పాటు చేయాలన్నారు. భక్తులు భోజనం చేసేందుకు వీలుగా పాపానాశనం నుండి త్రాగునీటి కొళాయిలు, మార్గమధ్యలో నిచ్చెనలు, బ్యారీకేడ్లు, ఇనుప కంచెలు, రోప్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా అవసరమైన సమాచార బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు.
భక్తులు వంట సామగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకువెళ్ళకుండా రేడియో అండ్ బ్రాడ్‌కాస్టింగ్ ద్వారా ఎప్పటికప్పుడు ప్రకటనలు చేసేలా సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో 80 మందికి పైగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. పోలీసుశాఖ, అటవీశాఖ, టిటిడి విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుండి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని వుంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని విభాగాలవారు సమన్వయంతో అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజివో కోరారు.
అన్నప్రసాదం డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాథ్, ప్రత్యేకాధికారి శ్రీ జీఎల్ఎన్ శాస్త్రీ, అశ్విని ఆసుపత్రి సూపరిండెంట్ డా.కుసుమకుమారి, తిరుమల 1వ, 2వ టౌన్ సిఐలు శ్రీ జగన్మోహన్ రెడ్డి, శ్రీ చంద్రశేఖర్, తిరుమల ఆర్‌టిసి డిఎమ్ శ్రీ విశ్వనాధ్, ఆరోగ్య విభాగం యూనిట్ అధికారి శ్రీ అమరనాథ్ రెడ్డి, ఎఫ్‌ఆర్‌వో శ్రీ ప్రభాకర్‌రెడ్డి, ఎవిఎస్వోలు శ్రీ గిరిధర్, శ్రీ శివయ్య, విఐలు శ్రీ సతీష్, శ్రీ శివశంకర్, శ్రీ ప్రతాప్, ఇతర విభాగాల అధికారులు సమావేశంలో పాల్గొన్నారు.
టిటిడి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.