PAVITROTSAVAMS COMMENCES AT VONTIMITTA _ ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్స‌వాలు ప్రారంభం

TIRUPATI, 07 SEPTEMBER 2021: The annual Pavitrotsavams in Sri Kodandarama Swamy temple at Vontimitta in YSR Kadapa district commenced on a grand religious note on Tuesday.

On the first day, Pavitra Pratista was performed along with Bala Bogam, Chatustarchana, Pavitra Homam, afternoon Aradhana, Bariharana and Sattumora. In the evening Nivedana will be offered.

AEO Sri Muralidhar, Superintendent Sri Venkatesh, Kankanabhattar Sri Rajesh were present.

ISSUED BY THE PUBLIC RELATION OFFICER, TTDs TIRUPATI

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్రోత్స‌వాలు ప్రారంభం

తిరుపతి, 2021 సెప్టెంబ‌రు 07: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాలు మంగ‌ళ‌వారం శాస్త్రోక్తంగా ప్రారంభ‌మ‌య్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్లగానీ తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.

మొద‌టి రోజు ఉద‌యం ప‌విత్ర ప్ర‌తిష్ట నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా బాల‌బోగం, చ‌తుష్టానార్చ‌న‌, ప‌విత్ర హోమం, మ‌ధ్యాహ్న ఆరాధ‌న‌, బ‌రిహ‌ర‌ణ‌, శాత్తుమొర చేప‌ట్టారు. సాయంత్రం ప‌విత్ర‌హోమం, నివేద‌న‌, శాత్తుమొర జ‌రుగ‌నున్నాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో శ్రీ ముర‌ళీధ‌ర్‌, సూపరింటెండెంట్ శ్రీ వెంక‌టేష్‌, కంక‌ణ‌భ‌ట్టార్ శ్రీ రాజేష్ స్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.

టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.